పాఠశాలలో వసతులను ఆన్‌లైన్ చేయాలి
భిక్కనూరు/పిట్లం/లింగంపేట: ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు సమకూర్చిన వసతులను సౌకర్యాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని భిక్కనూరు ఎంఈవో రాజగంగారెడ్డి అన్నారు. శనివారం ఆయన భిక్కనూరులో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల హెచ్‌ఎంల సమావేశంలో పాల్గొని మాట్లాడారు.మరుగుదొడ్లు తరగతి గదుల వివరాలు యూ డైస్ ప్లస్ వెబ్‌సైట్‌లో పొందుపరుచాలన్నారు. వచ్చె రెండు రోజుల్లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం యాదగరి,ఎంఐఎస్ కోఆర్డినేటర్ పాపాయ్య, సీఆర్‌పీలు సత్యం, మహేందర్‌లు పాల్గొన్నారు. అలాగే పిట్లం జెడ్పీహెచ్‌ఎస్‌లో ఎంఈవో దేవి సింగ్ ఆధ్వర్యంలో మండలంలోని ప్రభుత్వ ,ప్రైవేటు పాఠశాలలు, కేజీబీవీ రెసిడెన్షియల్, జూనియర్ కళాశాలల ప్రధానోపాధ్యాయులు, ఆపరేటర్లు యూడైస్ ప్లస్ లో డాటా ఎంట్రీ పై ఆర్పీ శ్రీధర్, ఎంఐఎస్ కోఆర్డినేటర్ అశోక్, సీఆర్పీ హైమద్ పాషాలు అవగాహన కల్పించారు.లింగంపేట మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రధానోపాధ్యాయుల సమావేశంలో మండల విద్యాధికారి షౌకత్‌అలీ మాట్లాడారు. పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరా లు నమోదు చేయాలన్నారు. యూ–డైస్ ప్లస్‌లో చేసిన వివరాల అధారంగానే విద్యార్థులకు మౌలిక వసతులు, గ్రాంట్లు, ఉపాధ్యాయుల కేటాయింపు, పాఠ్యపుస్తకాలు,దుస్తులు,తరగతి గదులు, టాయిలె ట్స్ ప్రభుత్వ పాఠశాలలకు మంజూరు అవుతాయన్నారు. సమయపాలన పాటించి సకాలంలో రిపోర్టులు ఎమ్మార్సీకి అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఐఎస్ స్వప్న, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు సత్యనారాయణ, రాజు, సంగాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలలో వసతులను ఆన్‌లైన్ చేయాలి
పాఠశాలలో వసతులను ఆన్‌లైన్ చేయాలి


