క్రైం కార్నర్
రెండు బైక్‌లు ఢీ: ఒకరి మృతి
● మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని నందివాడ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. తాడ్వాయికి చెందిన పుల్లూరి అనీల్ అనే వ్యక్తి తన బైక్‌పై తన భార్య మేఘనను ఎక్కించుకొని శనివారం నందివాడ శివారులో పొలం పనులకు వెళ్లారు. పనులు ముగించుకొని రాత్రి తాడ్వాయికి బైక్‌పై బయలుదేరారు. అదే సమయంలో మండలంలోని నందివాడ గ్రామానికి చెందిన రవి(32)ఎర్రాపహాడ్ నుంచి నందివాడకు తన బైక్‌పై వస్తున్నాడు. నందివాడ శివారులో ఇద్దరి బైక్‌లు ఎదురురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ఘటనలో రవికి తీవ్రగాయాలు కావడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. అనిల్, అతడి భార్యకు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనిల్ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం స్థానిక ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై తాడ్వాయి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.
తాడ్వాయి(ఎల్లారెడ్డి):ఇటీవల ఆత్మహత్యకు య త్నించిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన చెట్కూరి మల్లయ్య (46) ఇటీవల గ్రామంలో నూతన గృహాన్ని నిర్మించడానికి, వ్యవసాయ పనుల నిమిత్తం అప్పులు చేశాడు. కానీ అప్పులు తీరకపోవడంతో జీవితంపై విరక్తి చెంది అతడు గతనెల 29న పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే కుటుంబసభ్యులు అతడిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఎల్లారెడ్డిపేట్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు.
వర్ని: బాలికపై ఓ వ్యక్తి తరచూ అత్యాచారానికి పాల్పడడంతో గర్భం దాల్చిన ఘటన వర్ని మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ఒక గిరిజన తండాలో 14 ఏళ్ల బాలికపై మరో గిరిజన తండాకు చెందిన ఓ వ్యక్తి కొంతకాలంగా అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నాలుగు రోజుల క్రితం కడుపునొప్పితో బాలిక బాధపడటంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి బాలిక ఏడు నెలల గర్భవతిగా నిర్ధారించారు. దీంతో సదరు బాలిక వర్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై ఫోక్స్ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మహేష్ తెలిపారు.
క్రైం కార్నర్


