గాలికుంటు నివారణ టీకాలు వేయించాలి
కామారెడ్డి రూరల్/తాడ్వాయి : కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో పశువైద్య శిబిరాన్ని శనివారం పశువైద్యాధికారి రవికిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...435 పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా టీకాలు వేశామని తెలిపారు. పశువులకు ఒక్క దాని నుంచి మరొక్కదానికి గాలికుంటు వ్యాధి త్వరగా సోకుతుందని తెలిపారు. కార్యక్రమంలో గోపాల మిత్రలు ప్రవీణ్‌గౌడ్, శ్రీనివాస్, బాలు, బాబా, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు. తాడ్వాయి మండలంలోని దేవాయిపల్లి గ్రామంలో శనివారం ఆవులు, గేదేలకు పశువైద్యాధికారి రమేశ్ గాలికుంటు నివారణ టీకాలను వేశారు. ఈ సందర్భంగా 71ఆవులు, 95 గేదేలకు గాలికుంటు నివారణ టీకాలను వేశారు. పాడి రైతులు వైద్యశిబిరని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పోచయ్య, కొండల్‌రెడ్డి, ప్రేం సింగ్, డెయిరీ సూపర్‌వైజరు రమేశ్ రెడ్డి, గోపాల మిత్రలు మహిపాల్‌రెడ్డి, బ్రహ్మం, రైతులు పాల్గొన్నారు.
గాలికుంటు నివారణ టీకాలు వేయించాలి


