గుత్పతండాలో ఒకరి ఆత్మహత్య
మాక్లూర్: మండలంలోని గుత్ప తండాలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. తండాకు చెందిన బానోత్ చత్రునాయక్ (32) ఇంటి నిర్మాణం కోసం గతంలో ప్రయివేట్ ఫైనాన్స్‌లో రుణం తీసుకున్నాడు. కానీ రుణం తీరకపోవడంతో జీవితంపై విరక్తి చెందాడు. ఈక్రమంలో శుక్రవారం రాత్రి ఇంటి ఎదుట ఉన్న చెట్టుకు అతడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు మాక్లూర్ ఎస్సై–2 మోగులయ్య కేసు నమోదు చేసుకున్నారు.
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని రాఘవపల్లి సమీపంలో గల పెట్రోల్‌బంకు వద్ద ఆరబోసిన ధాన్యం కుప్పల్లో నుంచి ధాన్యం చోరీ కావడంపై శనివారం నాగిరెడ్డిపేట పోలీసులు కేసునమోదు చేశారు. రాఘవపల్లికి చెందిన చింతలపల్లి రాజు అనే రైతు తన ధాన్యాన్ని గ్రామసమీపంలోని పెట్రోల్‌బంకు వద్ద ఆరబెట్టారు. దీంతోపాటు శుక్రవారం రాత్రి నాలుగు సంచుల్లో ధాన్యం నింపి ఇంటికి వెళ్లి వచ్చి చూడగా ధాన్యంసంచులు కనిపించలేదు. దీంతో రాజు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసునమోదు చేసినట్లు ఇన్‌చార్జి ఎస్‌హెచ్‌వో మనోహర్‌రావు తెలిపారు.
కామారెడ్డి రూరల్: మండల శివారులోని నర్సన్నపల్లి బైపాస్ వద్ద 220 గ్రాముల గంజాయి పట్టుకుని సరఫరా చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు దేవునిపల్లి ఎస్‌ఐ భూవనేశ్వర్ శనివారం తెలిపారు. హైదరబాద్‌లోని చింతల్‌కు చెందిన కాసమల్ల రాకేష్ శుక్రవారం రాత్రి మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు గంజాయిని తరలిస్తుండగా వాహనాల తనిఖీల సమయంలో అతడి పట్టుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. రాకేష్ వద్ద ఉన్న 220 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని, అతడిని అరెస్టు చేశామన్నారు.


