ప్రధానోపాధ్యాయుడి సేవలు భేష్
● కల్వరాల జెడ్పీహెచ్‌ఎస్‌లో కిచెన్ షెడ్‌కు రూ.60వేలు ఖర్చు పెట్టి వినియోగంలోకి..
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని కల్వరాల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విష్ణువర్ధన్ రెడ్డి సేవలు భేష్‌గ్గా ఉన్నాయని ఎంఈవో యోసెఫ్ అన్నారు. శుక్రవారం పాఠశాల ఆవరణలో ఆయన నూతనంగా నిర్మించిన వంట గదిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తు పాఠశాలలో వంట గది అభివృద్ధి కోసం సొంత డబ్బులు రూ. 60 వేలు ఖర్చు పెట్టి వినియోగంలోకి తీసుకురావడంతో గ్రామస్తులు అభినందించారు. విద్యార్థులకు విద్యా బుద్దులు చెప్పడమే కాకుండా సొంత డబ్బులు పెట్టి పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న విష్ణువర్ధన్ రెడ్డిని పలువురు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.


