సర్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలి
● రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
సుదర్శన్‌రెడ్డి
కామారెడ్డి క్రైం: ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓటర్ జాబితా సవరణ, మార్పులు, చేర్పులు తదితర అంశాలపై పలు సూచనలు ఇచ్చారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్, ట్రైనీ కలెక్టర్ రవితేజ, ఆర్డీవో వీణ తదితరులు పాల్గొన్నారు.


