నకిలీ నోట్ల కలకలం! | - | Sakshi
Sakshi News home page

నకిలీ నోట్ల కలకలం!

Nov 2 2025 9:16 AM | Updated on Nov 2 2025 9:16 AM

నకిలీ నోట్ల కలకలం!

నకిలీ నోట్ల కలకలం!

నకిలీ నోట్ల కలకలం!

ఆందోళన చెందుతున్న ప్రజలు

పోలీసుల అదుపులో ఐదుగురు

పెద్దకొడప్‌గల్‌: జుక్కల్‌ నియోజకవర్గంలో నకిలీ నోట్లు కలకలం సృష్టిస్తున్నాయి. నంబర్లు లేని, చిల్డ్రన్‌ బ్యాంక్‌ పేరుతో ఉన్న నోట్లను చలామణి చేస్తుండడంతో ప్ర జలు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని ఓ వ్యక్తి తీసుకున్న అప్పు కింద వీటిని ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ నోట్లను తీసుకున్న వ్యక్తి వీటిని గుర్తించి పో లీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వ చ్చింది. కొంతకాలంగా జుక్కల్‌ నియోజకవర్గంలో కొంతమంది వ్యక్తులు నకిలి నోట్లను చలామణి చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇందులో జిల్లాలోని పె ద్దకొడప్‌గల్‌, మద్నూర్‌, జుక్కల్‌ మండలాలతోపాటు సంగారెడ్డి జిల్లాలోని కంగ్టి మండలం, కర్ణాటక, మహారాష్ట్ర రాష్టాలకు చెందిన వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement