ఐసీఏఆర్ వరి వంగడంతో రైతులకు మేలు
దోమకొండ: కొత్త రకం ఐసీఏఆర్ వరి వంగడం డీఆర్‌ఆర్75తో రైతులకు ప్రయోజనం కలుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. సంఘమేశ్వర్‌కు చెందిన రైతు సంజీవ్‌రెడ్డి ఇటీవల వరి పరిశోధన కేంద్రం హైదరాబాద్ నుంచి ఈ రకం వంగడం తీసుకువచ్చి పంట పండించారు. ఆ పంటను ఆయన శనివారం పరిశీలించి, రైతులతో మాట్లాడారు. ఈ రకంతో మంచి దిగుబడులు వస్తాయన్నారు. పంట మార్పిడి వల్ల భూమిలో సారం పెరిగి పంట దిగుబడులు పెరుగుతాయన్నారు. హైదరాబాద్‌నుంచి నూతన రకం వంగడం తీసుకువచ్చి సాగు చేసిన రైతును అభినందించారు. ఆయన వెంట ఏడీఏ పూర్ణిమ, దోమకొండ సింగిల్ విండో చైర్మన్ నాగరాజ్‌రెడ్డి, సొసైటీ సీఈవో బాల్‌రెడ్డి, ఏఈవో కృష్ణారెడ్డి, రైతులు ఉన్నారు.
మాచారెడ్డి: క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని జిల్లా విద్యాధికారి రాజు పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలో పాఠశాలల అథ్లెటిక్స్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు గెలుపు ఓటములను సమానంగా తీసుకొని మందుకెళ్లాలన్నారు. అండర్–11, అండర్–14, అండర్ –17 బాలబాలికల విభాగాలలో నిర్వహించిన పోటీలలో తొమ్మిది పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో క్రీడోత్సవ కమిటీ కన్వీనర్ వెంకటాచారి, ఎస్సై అనిల్, దేవేందర్‌రావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి విజయలక్ష్మి, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.
కామారెడ్డి క్రైం: జిల్లా రెవెన్యూ అధికారి మధుమోహన్ శనివారం ఇన్‌చార్జి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
కామారెడ్డి క్రైం: అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పంట నష్టం జరుగకుండా రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శనివారం ఒక ప్రకటన ద్వారా సూచించారు. పొలాల్లో నీరు నిలవకుండా కాలువలు తీసుకోవాలని పేర్కొన్నారు. పంట నష్టం జరిగితే వెంటనే స్థానికంగా ఉండే వ్యవసాయ అధికారులకు సమాచారం ఇవ్వాలని, నష్ట నివారణకు వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటించాలని సూచించారు.
నిజాంసాగర్: అచ్చంపేట కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకాలు చేపట్టాలని రైతులు సొసైటీ చైర్మన్ నర్సింహారెడ్డిని కోరారు. శనివారం ఆయన కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, రైతులతో మాట్లాడారు. నిజాంసాగర్ ప్రాజెక్టు వరద నీటిప్రవాహం వల్ల ధాన్యం బస్తాలను రైస్ మిల్లులకు తరలించే మార్గం లేదన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్ల ద్వారా నీటి విడుదల నిలిపి వేస్తేనే మార్గం ఏర్పడుతుందన్నారు. ఆయన వెంట సొసైటీ సీఈవో సంగమేశ్వర్‌గౌడ్, రైతులు ఉన్నారు.
ఐసీఏఆర్ వరి వంగడంతో రైతులకు మేలు
ఐసీఏఆర్ వరి వంగడంతో రైతులకు మేలు
ఐసీఏఆర్ వరి వంగడంతో రైతులకు మేలు


