● కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి ఇంద్రకరణ్‌రెడ్డి
భిక్కనూరు: ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న మహ్మద్ అలీ షబ్బీర్‌కు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పదవితో పాటు మంత్రి పదవిని కట్టబెట్టాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన భిక్కనూరులో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి 45 ఏళ్లుగా ఆమోఘమైన సేవలను షబ్బీర్‌అలీ అందిస్తున్నారన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి కోసం కామారెడ్డిని వదిలి నిజామాబాద్ నుంచి పోటీ చేశారన్నారు. పార్టీకి ఎప్పుడు విధేయుడిగా ఉంటున్న షబ్బీర్‌అలీ గతంలో మంత్రిగా పనిచేసిస నమయంలో ఎన్నో అభివృద్ధి పనులను చేశారని గుర్తు చేశారు. సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బల్యాల సుదర్శన్, విండో చైర్మన్ గంగళ్ల భూమయ్య, సిద్ధరామేశ్వరాలయం పునర్‌నిర్మాణకమిటీ చైర్మన్ లింబాద్రి, వైస్ చైర్మన్ అందె దయాకర్‌రెడ్డి, నేతలు మైపాల్‌రెడ్డి, దుంపల మోహన్‌రెడ్డి, మద్దూరి రవి పాల్గొన్నారు.
మాట్లాడుతున్న ఇంద్రకరణ్ రెడ్డి


