కుల వివక్ష చూపొద్దు
లింగంపేట(ఎల్లారెడ్డి): సమాజంలో కుల వివక్ష చూపడం నేరమని ఇన్‌చార్జి ఎంపీడీవో మలహరి అన్నారు. శుక్రవారం లింగంపేటలో పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సమాజంలో అందరికి సమాన హక్కులు ఉంటాయన్నారు. దళితుల పట్ల వివక్ష చూపవద్దన్నారు. గిర్దావార్ కిరణ్, ఎస్సీ హాస్టల్ వార్డెన్ శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి శ్రావణ్‌కుమార్, ఏఎన్‌ఎం రాజమణి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
దుర్కిలో..
నస్రుల్లాబాద్: దుర్కిలో శుక్రవారం పౌర హక్కుల దినోత్సవాన్ని అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌ఐ వెంకట స్వామి మాట్లాడారు. గ్రామంలో దేవాలయాలకు అందరికి అనుమతి ఉంటుందన్నారు. రెండు గ్లాసుల పద్దతిని విడనాడాలన్నారు. అంబేడ్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మైశయ్య, జీపీవో సునీత, మాజీ ఎంపీటీసీ కుమ్మరి నారాయణ, గ్రామస్తులు పాల్గొన్నారు.
హక్కుల గురించి ప్రతి
ఒక్కరూ తెలుసుకోవాలి
మద్నూర్(జుక్కల్): పౌర హక్కుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆర్‌ఐ సాయిబాబా అన్నారు. డోంగ్లీ మండలంలోని పెద్ద టాక్లీలో శుక్రవారం రెవెన్యూ, సోషల్ వెల్ఫేర్, పోలీసు శాఖ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు.


