అనారోగ్యంతో కాంగ్రెస్ నేత మృతి
● పాడెమోసిన ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు
నిజాంసాగర్: జెడ్పీటీసీ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ నేత గొర్రె కృష్ణారెడ్డి గురువారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందాడు. మండలంలోని మల్లూర్ గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా మాజీ జెడ్పీటీసీగా, సమితి ప్రెసిడెంట్‌గా ఉమ్మడి జిల్లాలో పేరుగాంచారు. కాంగ్రెస్ పార్టీలో కరుడు కట్టిన నేతగా ఉన్న కృష్ణారెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్సపొందుతూ కన్ను మూశాడు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో శుక్రవారం నిర్వహించిన అంతిమయాత్రకు జు క్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు హాజరై పాడె మోశారు.ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నిజాంసాగర్ మండల అధ్యక్షుడు మల్లికార్జున్, మల్లూర్ గ్రామస్తులు పాల్గొన్నారు.
అనారోగ్యంతో కాంగ్రెస్ నేత మృతి


