పశువులకు గాలికుంటు టీకాలు వేయించాలి
మద్నూర్(జుక్కల్): పశుపోషకులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు తప్పకుండా వేయించాలని మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేశ్ పటేల్ పేర్కొన్నారు. డోంగ్లీ మండలంలోని మొగాలో శుక్రవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు టీకాలను వేసి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పశువైద్య శిబిరంలో 109 ఆవులు, 52 ఎడ్లు, 45 దూడలు, 37 లేడ దూడలకు టీకాలు వేశామని డోంగ్లీ పశు వైద్యడు వినీత్ తెలిపారు. పశువైద్య సిబ్బంది సయ్యద్ మున్వీర్ ఆలీ, శేఖర్, గోపాలమిత్ర నాగ్‌నాథ్, చంద్రశేఖర్, రైతులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


