కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి
దోమకొండ: రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని మండల ప్రత్యేకాధికారి, జిల్లా ఉద్యానవన అధికారి జ్యోతి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద ధాన్యం కొనుగొలు కేంద్రంను పరిశీలించి మాట్లాడారు. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొనుగోళ్లను వేగవంతం చేయాలని నిర్వాహకులకు సూచించారు. అదేవిధంగా ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, సొసైటీ సీఈవో బాల్‌రెడ్డి, తదితరులున్నారు.
రైతులకు ఇబ్బందుల్లేకుండా చూడాలి
గాంధారి(ఎల్లారెడ్డి): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందుల్లేకుండా చూడాలని ఏవో రాజలింగం అన్నారు. శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు.
రైతుల ఖాతాల్లో డబ్బులు జమ
నిజాంసాగర్(జుక్కల్): ధాన్యం విక్రయించిన రెండు రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు ఐకేపీ ఏపీఎం ప్రసన్నరాణి చెప్పారు. శుక్రవారం బంజపల్లి, బ్రాహ్మణపల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను ఆమె పరిశీలించారు. బంజపల్లి పరిధిలో 20 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.20.3 లక్షలు వేసినట్లు తెలిపారు. అచ్చంపేట క్లస్టర్ ఏఈవో స్వర్ణలత ఉన్నారు.


