లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
బాన్సువాడ: బాన్సువాడలోని తన నివాసంలో శుక్రవారం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి డబుల్‌బెడ్‌రూం లబ్ధిదారులకు మంజూరైన బిల్లులకు సంబంధించిన చెక్కులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని పొతంగల్, కోటగిరి, రుద్రూర్, వర్ని మండలాలకు చెందిన 57 మంది లబ్ధిదారులకు రూ.కోటి 79లక్షల 17వేల 130 విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు. వివిధ మండలాలకు చెందిన నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణరెడ్డి శుక్రవారం సాయంత్రం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్లు బి.చందర్(స్థానిక సంస్థలు), విక్టర్(రెవెన్యూ)లతో సమావేశమై వివిధ అభివృద్ధి పనులపై చర్చించారు. నియోజకవర్గానికి సంబంధించి రెవెన్యూ, అటవీ, విద్య, వైద్యం, మున్సిపల్, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, ఎకై ్సజ్ తదితర ప్రభుత్వ పథకాల అమలు, తదితర అంశాలపై చర్చించారు. ఆయా శాఖల జి ల్లా ముఖ్య అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
మద్నూర్(జుక్కల్): డోంగ్లీ శివారులో గురువారం అర్ధరాత్రి నిందితులు ఐదు చోట్ల ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి అందులో ఉన్న ఆయిల్, కాపర్ చోరీ చేసినట్లు రైతులు శుక్రవారం తెలిపారు. డోంగ్లీ శివారులో అర్ధరాత్రి దుండగులు ఐదు చోట్ల చోరీకి పాల్పడ్డారని పేర్కొన్నారు. పోలీసులు స్పందించి ట్రాన్స్‌ఫార్మర్ దొంగలను పట్టుకొని చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ


