
వద్దురా.. అడవికి నిప్పురా..
అటవీ శాఖ కామారెడ్డి రేంజ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వి.రమేశ్ ‘వద్దురా.. అడవికి నిప్పురా’ అంటూ కనువిప్పు కలిగించేలా పాటను రాసి, పాడి సీడీ రూపంలో తీసుకువచ్చారు. అడవిలో నిప్పు పెట్టడం వల్ల ఫల వృక్షాలు, పెద్ద పెద్ద చెట్లు కాలిపోతాయని, వన్యప్రాణులకు ముప్పు ఏర్పడుతుందని ఆ పాటలో వివరించారు. అటవీ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల గురించి ‘అడవి మొత్తం తిరుగుతున్న.. అలసిపోతావున్న’ అంటూ పాట రాసి పాడారు. ‘ఏమిచ్చి నీ రుణం తీర్చనూ చెట్టమ్మా..’ అంటూ చెట్టు ద్వారా జీవకోటికి కలిగే ప్రయోజనాలను వివరించారు. ‘రారో రాజన్న’, ‘వందనం.. వందనం.. అభివందనం’, ‘వందనాలు వందనాలు ఓ అటవీ సైనికా’, ‘ఓ అడవి సైనిక ఈ అడవి మనదిరా..’ అంటూ పలు పాటలు రాశారు. 15 పాటలు రాసిన రమేశ్, ఆరు పాటలను రికార్డు చేసి విడుదల చేశారు. అలాగే సామాజిక అంశాలపైనా ఆయన ఎన్నో పాటలు, కవితాలు రాశారు.