
సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలి
కామారెడ్డి టౌన్: జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల మహిళా సంఘం(పీవోడబ్ల్యూ) ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయ ఏవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పి.రమా మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రులలో మెరుగైన సేవలు అందించాలని, సరిపడా మందులను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రాలలో వైద్యులను 24 గంటల పాటు అందుబాటులో ఉంచాలన్నారు. రోగ నిర్థారణ చేసే పరీక్షలు చేయించాలని, ల్యాబ్ టెక్నిషియన్‌ల ఖాళీలను భర్తి చేయాలని కోరారు. నేతలు సత్తెమ్మ, పద్మ, అనిత, పుష్పలత, యాదమ్మ, లక్ష్మి, రూప పాల్గొన్నారు.