ప్రాదేశిక స్థానాల లెక్క తేలింది | - | Sakshi
Sakshi News home page

ప్రాదేశిక స్థానాల లెక్క తేలింది

Jul 17 2025 3:38 AM | Updated on Jul 17 2025 3:38 AM

ప్రాదేశిక స్థానాల  లెక్క తేలింది

ప్రాదేశిక స్థానాల లెక్క తేలింది

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: జిల్లాలో మండల, జిల్లా పరిషత్‌ స్థానాల లెక్క తేలింది. 25 మండలాలకు ఎంపీపీ, జెడ్పీటీసీలు ఉంటారు. అలాగే 233 మండల ప్రాదేశిక స్థానాలు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వీటి ఆధారంగా ఎన్నికలకు వెళ్లనున్నారు.

బాలికల పాఠశాలను దత్తత తీసుకున్న స్వచ్ఛంద సంస్థ

పిట్లం: మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలిక ల పాఠశాలను బుధవారం హైదరాబాద్‌కు చెందిన సేవ్‌ ద గర్ల్‌ చైల్డ్‌ స్వచ్ఛంద సంస్థ సభ్యులు సందర్శించారు. పాఠశాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ సంస్థ చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌ శివకుమార్‌ ఆధ్వర్యంలో పనిచేస్తోంది. ఆయన స్వస్థలం పిట్లం. సంస్థ ప్రతినిధులు పాఠశాల సిబ్బంది, విద్యార్థులతో మాట్లాడి సమస్యల ను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల భవనానికి రంగులు వేయడంతోపాటు విద్యార్థుకలు అవసరమైన వస్తువులను అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు స్రవంతి, శర ణ్య, గీతానంద్‌, స్వప్న రాగి, రమేశ్‌ బాబు, హరిప్రకాశ్‌, ప్రదీప్‌రెడ్డి, నాగేంద్ర, వంశీకృష్ణ, రాజేంద్ర పల్నాటి, ఎంఈవో దేవ్‌సింగ్‌, పాఠశాల హెచ్‌ఎం రమణారావు పాల్గొన్నారు.

‘ఆర్థిక స్వావలంబన

సాధించాలి’

బాన్సువాడ రూరల్‌: ప్రభుత్వం, బ్యాంకులు అందిస్తున్న సహకారంతో మహిళలు వృత్తి, వ్యాపారాల్లో రాణించి ఆర్థిక స్వావలంబన సాధించాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. బుధవారం బాన్సువాడలోని ఎస్‌ఎంబీ ఫంక్షన్‌ హాల్‌లో ఇందిర మహిళాశక్తి సంబురాలు నిర్వహించారు. నియోజకవర్గంలోని 3,719 డ్వాక్రా సంఘాలకు సంబంధించిన 2024–25 వడ్డీరాయితీ డబ్బులు రూ.3.76 కోట్ల చెక్కును ఆయా సంఘాలకు అందించారు. మరణించిన ఆరుగురు మహిళా సంఘాల సభ్యుల కుటుంబాలకు మంజూరైన రూ. 60 లక్షల బీమా చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ గురుకుల పాఠశాలలకు కిరాణ సరుకులు సరఫరా చేయడానికి డ్వాక్రా సంఘాలు ముందుకు వస్తే అధికారులతో మాట్లాడి ప్రోత్సహిస్తానన్నారు. కార్యక్రమంలో ఆగ్రో చైర్మన్‌ బాల్‌రాజ్‌, సబ్‌కలెక్టర్‌ కిరణ్మయి, డీఆర్‌డీవో సురేందర్‌, బీర్కూర్‌ ఏఎంసీ చైర్‌పర్సన్‌ దుర్గం శ్యామల తదితరులు పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి టౌన్‌: జిల్లాలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రుల పరిధిలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను కాంట్రాక్ట్‌ పద్ధతిన భర్తీ చేస్తున్నట్లు డీసీహెచ్‌ఎస్‌ విజయలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ిఎల్లారెడ్డి సీహెచ్‌సీలో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌(గైనిక్‌) పోస్టులు రెండు, అనస్థీషియా ఒకటి, బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో పీడియాట్రి షియన్‌ ఒకటి, జనరల్‌ జీడీఎంవో రెండు, మద్నూర్‌ సీహెచ్‌సీలో జనరల్‌ సర్జన్‌ ఒకటి, జనరల్‌ జీడీఎంవో ఒక పోస్టు భర్తీ చేస్తామని పేర్కొన్నారు. అర్హులైన వైద్యులు ఈనెల 21వ తేదీ వరకు జిల్లా కేంద్రంలోని డీసీహెచ్‌ఎస్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 23న ఇంటర్వ్యూ ఉంటుందని తెలిపారు.

‘సర్కారు బడులను

బతికించుకోవాలి’

మాచారెడ్డి : సర్కారు బడులను బతికించుకో వాలని డీఈవో రాజు కోరారు. బుధవారం నెమిలిగుట్ట తండాలో నూతనంగా ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025–26 విద్యాసంవత్సరానికిగాను మాచారెడ్డి మండలంలో పాఠశాలల్లో 6 వందలకుపైగా విద్యార్థులు చేరారన్నారు. మండలానికి చెందిన 28 మంది విద్యార్థులు ట్రిపుల్‌ ఐటీకి ఎంపిక కావడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో ఎంఈవో దేవేందర్‌రావ్‌, ఏఎంవో వేణు శర్మ, హెచ్‌ఎంలు వెంకటాచారి, భాస్కరశర్మ, ఉపాధ్యాయుడు మాణిక్యం, సీఆర్పీలు సంజీవ్‌, నరేశ్‌, శ్రీకాంత్‌, కాంగ్రెస్‌ నాయకులు నౌసీలాల్‌, నర్సింలు, రవినాయక్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement