
సర్కారు బడికి ఊపిరి
● తల్లిదండ్రులతో సమావేశమైన
కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు
● సొంత డబ్బులతో ఇద్దరు
విద్యావలంటీర్ల నియామకం
● పిల్లలను బడికి పంపించేందుకు
ఒప్పుకున్న పేరెంట్స్
● పుష్కరకాలం తర్వాత దగ్గి స్కూల్ పునఃప్రారంభం
సదాశివనగర్ : దగ్గిలోని ప్రాథమిక పాఠశాల పుష్కర కాలం క్రితం మూతబడింది. ఆ తర్వాత పట్టించుకున్నవారే లేరు. తాజాగా ఈ పాఠశాలను తెరిపించి ఆదర్శంగా నిలిచారు కల్వరాల్ స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు విష్ణువర్ధన్‌రెడ్డి.
సిద్దిపేట జిల్లాకు చెందిన విష్ణువర్ధన్‌రెడ్డి బదిలీపై రెండేళ్ల క్రితం కల్వరాల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడిగా వచ్చారు. ఆయన విధుల్లో చేరిన సమయంలో ఆ హైస్కూల్‌లో ఏడుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. మూతబడే స్థితిలో ఉన్న పాఠశాల గతి మార్చేందుకు ఆయన గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామాభివృద్ధి కమిటీ సహకారంతో బడి రూపురేఖలు మార్చారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడికి పంపించడం ప్రారంభించారు. ప్రధానోపాధ్యాయుడి కృషితో ప్రస్తుతం ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 86కు చేరింది.
దగ్గి పాఠశాలపై దృష్టి..
కల్వరాల్ స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో 17 పాఠశాలలున్నాయి. అందులో దగ్గిలోని ప్రైమరీ స్కూల్ విద్యార్థులు లేక 2013లో మూతబడింది. ఆ బడిని తెరిపించేందుకు ప్రయత్నాలు జరగకపోవడంతో అప్పటినుంచి మూసే ఉంటోంది. స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడిగా విష్ణువర్ధన్‌రెడ్డి వచ్చాక ఆ బడిపై దృష్టి సారించారు. గ్రామస్తులతో సమావే శమై చర్చించారు. ఇంటింటికి వెళ్లి పిల్లలను సర్కా రు బడికి పంపించాలని కోరారు. ఆయన కృషి ఫలించి 22 మంది విద్యార్థులను బడికి పంపించేందుకు తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలో విష్ణువర్ధన్‌రెడ్డే సొంత డబ్బులతో పాఠశాల ఆవరణలో పెరిగిన పిచ్చిమొక్కలను తొలగింపజేశారు. బడికి పెయింటింగ్ వేయించారు. విద్యార్థులకు అవసరమైన కుర్చీలు, టేబుళ్లతోపాటు ఆటవస్తువు లు కొనుగోలు చేసి అందుబాటులో ఉంచారు. విద్యార్థులకోసం ఇద్దరు విద్యావలంటీర్లను నియ మించారు. వారికి ప్రతినెలా రూ. 5 వేల చొప్పున ఆయనే వేతనాలు ఇస్తున్నారు. ఇలా స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు చేస్తున్న కృషితో పన్నెండేళ్ల తర్వాత బడి మళ్లీ తెరచుకుంది. ఇటీవల డీఈవో ఈ స్కూల్‌ను పునఃప్రారంభించారు.
మౌలిక వసతులు కల్పిస్తున్నా..
విద్యార్థులకు నాణ్యమైన వి ద్య అందించడానికి కృషి చే స్తున్నా. సొంత డబ్బులతో వారికి అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నా. పిల్లల తల్లిదండ్రులతో మా ట్లాడి దగ్గిలో మూతబడిన ప్రాథమిక పాఠశాల పునఃప్రారంభమయ్యేలా చూశా.
– విష్ణువర్ధన్‌రెడ్డి, హెచ్‌ఎం, కల్వరాల్
బాగా పాఠాలు చెబుతున్నారు
మా గ్రామంలో పన్నెండేళ్ల కింద మూతబడిన ప్రాథమిక పాఠశాలను ఈసారి తిరిగి తెరిచారు. ఇప్పుడు ప్రైవేట్ పాఠశాల కంటే మంచిగా చదువు నేర్పిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. పాఠశాలను తెరిపించిన పెద్ద సార్ విష్ణువర్ధన్‌రెడ్డికి రుణపడి ఉంటాం. –సౌందర్య, విద్యార్థి తల్లి, దగ్గి

సర్కారు బడికి ఊపిరి

సర్కారు బడికి ఊపిరి