
ఒడ్డేపల్లి బీపీఎం సస్పెన్షన్
నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని ఒడ్డేపల్లి బీపీఎం నిఖితను జిల్లా తపాలా అధికారులు సస్పెండ్ చేశారు. పొదుపు డబ్బులు స్వాహా అంటూ శుక్రవారం సాక్షి దినపత్రికలో వచ్చిన కథనానికి జిల్లా పోస్టాఫీస్ అధికారులు స్పందించారు. ఈమేరకు శనివారం ఒడ్డేపల్లి గ్రామంలోని పోస్టాఫీస్‌లె జిల్లా పోస్టాఫీస్ ఇన్‌స్పెక్టర్ సుజిత్, మానిటరింగ్ అధికారి వెంకట్రాంరెడ్డి విచారణ చేపట్టారు. ఖాతాదారులను కార్యాలయానికి పిలిపించి విచారణ చేపట్టారు. పొదుపు డబ్బులతో పాటు కొన్ని లావాదేవీలకు సంబందించిన డబ్బులు జమచేయడంలో తేడాలు ఉన్నట్లు అధికారుల విచారణలో తేలింది. రెండు, మూడు రోజుల పాటు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని జిల్లా పోస్టాఫీస్ ఇన్‌స్పెక్టర్ సుజిత్ తెలిపారు. ఇన్‌చార్జీ బీపీఎం శశికాంత్ తదితరులు ఉన్నారు.

ఒడ్డేపల్లి బీపీఎం సస్పెన్షన్