ఘనంగా మహంకాళి తొట్టెల ఊరేగింపు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా మహంకాళి తొట్టెల ఊరేగింపు

Jul 13 2025 7:40 AM | Updated on Jul 13 2025 7:40 AM

ఘనంగా

ఘనంగా మహంకాళి తొట్టెల ఊరేగింపు

బీబీపేట: మండల కేంద్రంలోని మహంకాళి అమ్మ వారి తొట్టెల ఊరేగింపును శనివారం శివశక్తి ఉత్సవ కమిటీ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఏ టా ఆషాఢంలో బోనాలను సమర్పిస్తారు. ఈసారి ప్రత్యేకంగా తొట్టెల ఊరేగింపు చేపట్టారు. ఈ సందర్భంగా పోతరాజులు తమ విన్యాసాలతో అలరించారు. మండలకేంద్రంలోని అన్ని వీధుల మీదుగా ఈ శోభాయత్ర సాగింది. గ్రామస్తులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కిక్కిరిసిన మేకల సంత

నవీపేట: మండల కేంద్రంలో శనివారం జరిగిన మేకల సంత వ్యాపారులు, వినియోగదారులతో కిక్కిరిసిపోయింది. ఈ ఆదివారం జిల్లా కేంద్రంతోపాటు వివిధ గ్రామాలలో ఊర పండుగలు, బోనాల సంబురాలు నిర్వహిస్తుండడంతో సంత ప్రాంగణం సందడిగా మారింది. ఆషాఢమాసంలో ఆనవాయితీగా సాగే వన భోజనాలు కూడా ఈ ఆదివారం ఉండడంతో వ్యాపారులకు కలిసి వచ్చింది. దీంతో జీవాల రేట్లు ఆమాంతం పెంచేశారు. ఒక్కో మేక ధర రూ. 7 వేల నుంచి రూ. 10 వేలకు విక్రయించారు. అలాగే పొట్టేలు (మేక పోతు) రూ. 12 వేల నుంచి రూ. 15 వేలకు విక్రయించారు. ధరలను లెక్క చేయకుండా వినియోగదారులు పోటాపోటీగా కొనుగోళ్లు చేశారు. సంతలో రూ. 3 నుంచి రూ. 4 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు వ్యాపారులు పేర్కొన్నారు.

ఘనంగా మహంకాళి తొట్టెల ఊరేగింపు1
1/1

ఘనంగా మహంకాళి తొట్టెల ఊరేగింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement