
పాఠశాలలో పాముల బెడద..!
కామారెడ్డి: నాగిరెడ్డిపేట మండలంలోని ఆత్మకూర్ హైస్కూల్‌లో కొన్నిరోజులుగా పాముల బెడద నెలకొంది. పాఠశాల చుట్టూ ప్రహరీ లేకపోవడం, చుట్టూ పంటపొలాలు ఉండడంతో తరుచూ పాఠశాలలోకి పాములు వస్తున్నాయి. దీనికితోడు పాఠశాలకు సంబంధించి శిథిలావస్థలో ఉన్న తరగతి గదుల తలుపులు, కిటికీలలో నుంచి పాములు లోనికి ప్రవేశిస్తున్నాయి. గత మంగళవారం సైతం పాఠశాలలోని ఓ తరగతి గది తలుపు వద్ద పాము కుబుసం ఉండడంతో అనుమానంతో ఉపాధ్యాయులు తలుపు వద్దనున్న చెక్కల మధ్య పరిశీలించి చూడగా రెండు పాములు దర్శనమిచ్చాయి. దీంతో భయాందోళన చెందిన ఉపాధ్యాయులు కర్రలతో రెండుపాములను కొట్టి చంపారు. ఒకవైపు విద్యార్థులకు సరిపడా తరగతిగదులు లేకపోవడంతోపాటు శిథిలావస్థకు చేరిన గదుల్లో దర్శనమిస్తున్న పాములతో అటు ఉపాధ్యాయులతోపాటు ఇటు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి పాఠశాల ఆవరణలో ఉన్న శిథిలమైన తరగతి గదులను కూల్చేసి నూతన గదుల నిర్మాణానికి కృషి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
భయాందోళనలో ఉపాధ్యాయులు, విద్యార్థులు

పాఠశాలలో పాముల బెడద..!