
విచ్చలవిడిగా గడ్డిమందు వాడకం
ఎల్లారెడ్డిరూరల్: ప్రభుత్వం నిషేధించిన గడ్డిమందును వాడుతూ ప్రజలను అనారోగ్యాల బారిన పడేలా చేస్తున్నారు. పంటలు పండించే ప్రాంతాలలో ప్రభుత్వం గ్‌లైఫోసెట్ మందును నిషేధించినప్పటికి అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ఫర్టిలైజర్ దుకాణాదారులు విచ్చలవిడిగా గడ్డిమందును విక్రయిస్తూ పర్యావరణానికి హాని కలిగిస్తున్నారు. గ్‌లైఫోసెట్ గడ్డిమందు వాడకం వల్ల మానవుడి నాడీవ్యవస్థపై ప్రభావం చూపడంతో పాటు పర్యావరణానికి హాని కలిగిస్తున్నదన్న కారణంతో ప్రభుత్వం ఆ మందును నిషేధించింది. అధికారుల తనిఖీలు లేకపోవడంతోనే నిషేధిత గడ్డిమందు అమ్మకాలు జరుగుతున్నాయి.
సీసీ కెమెరాలు
ఏర్పాటు చేసుకోవాలి
రుద్రూర్: సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్సై సాయన్న సూచించారు. రుద్రూర్ మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ...సీసీ కెమెరాలతో నేరాలను నియంత్రించవచ్చని పేర్కొన్నారు. గ్రామాల్లో గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

విచ్చలవిడిగా గడ్డిమందు వాడకం