
వృద్ధులకు పింఛన్ కట్!
బాన్సువాడ : జిల్లాలో పలువురు వృద్ధులకు చే యూత పింఛన్లు నిలిచిపోయాయి. దీంతో బాధితు లు లబోదిబోమంటున్నారు. గత నెలలో డబ్బులు తక్కువ వచ్చాయంటూ రెండు రోజులపాటే పింఛ న్లు పంపిణీ చేశారు. దీంతో చాలా మంది పింఛన్లు కోల్పోయి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగు తున్నారు. జిల్లాలో ప్రతి నెలా 1,61,808 మంది వి విధ రకాల పింఛన్‌దారులకు రూ.3,61,60,828 పంపిణీ చేస్తున్నారు. ఏప్రిల్ నెలలో 10 రోజులపా టు పంపిణీ చేసిన పింఛన్లు, మే నెలలో ఆరు రోజు లు మాత్రమే అందజేశారు. పోస్టాఫీసుకు వచ్చే పింఛన్‌దారులు చాలా మంది వరుసలో నిలబడలేక వచ్చే నెలలో తీసుకుందామనుకునే వారు వందల్లో ఉన్నారు. ఒక్క బాన్సువాడ మున్సిపాలిటీలోనే 3,343 మందికి వివిధ రకాల పింఛన్లు ఉన్నాయి. అయితే పోస్టాఫీసులో విధులు నిర్వహించే ఒకే ఉద్యోగి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. జూన్ చివరి వారంలో విడుదలైన పింఛన్లు రెండు రోజులు మాత్రమే పంపిణీ చేయడంతో చాలా మందికి డబ్బులు అందలేదు. అదే సమయంలో చాలా మంది పింఛన్లు కట్ అయ్యాయని సిబ్బంది చెప్పడంతో వృద్ధులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీంతో సబ్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
రెండు రోజులే పంపిణీ చేయడంతో ‘చేయూత’ కోల్పోయిన వైనం
ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న
బాధితులు
డబ్బులు రాలేవంటూ చేతులు
దులుపుకుంటున్న అధికారులు