
ఆదర్శం.. చిన్నకొడప్గల్ సొసైటీ
పిట్లం(జుక్కల్): దీర్ఘకాలిక రుణాల వసూళ్లలో 2024–25 సంవత్సరంలో చిన్నకొడప్గల్ సొసైటీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రథమస్థానంలో నిలిచింది. దీర్ఘకాలిక రుణాల వసూళ్లలో సొసైటీ 45 శాతం రుణాలు వసూళ్లు చేసింది. నిజామాబాద్ లోని ఎన్‌డీసీసీ సెంట్రల్ బ్యాంక్‌లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో అధికారులు చిన్నకొడప్గల్ సొసైటీ కార్యదర్శి హన్మాండ్లును ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. చిన్నకొడప్గల్ సహకార సంఘం పరిధిలో 8 గ్రామాలు ఉన్నాయి.సహకార సంఘంలో మొత్తం 4,300 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు.ఇందులో 3,476 మంది రైతులకు సభ్యత్వం ఉండగా,ఇందులో 3, 195 మంది రైతులు స్వల్పకాలిక, 281 మంది రైతు లు దీర్ఘ కాలిక రుణాలు తీసుకున్నారు. దీర్ఘకాలికరుణాలు తీసుకున్న రైతులకు రుణం వడ్డీలో 40 శాతం రాయితీ వస్తుందని బ్యాంక్ సిబ్బంది ద్వా రా,మహజన సభలలో సొసైటీ సిబ్బంది అవగాహన కల్పించడంతో రైతులు రుణాలు చెల్లించడాని కి ముందుకు వచ్చారు.సొసైటీ పరిధిలో 281 మంది రైతులకు రూ.8 కోట్ల దీర్ఘ కాలిక రుణాలు తీసుకున్నారు. ఇందులో 2024– 25 సంవత్సరంలో 180 మంది రైతుల వద్ద నుంచి రూ. 3 కోట్ల 80 ల క్షల రుణాలు వసూళ్లు చేసి ఉమ్మడి నిజామాబాద్ జి ల్లాలో ఆదర్శంగా నిలిచింది. సొసైటీ సిబ్బంది రైతులకు సకాలంలో పంట రుణాలు, ఎరువులు, విత్తనాలు అందిస్తున్నారు. సి బ్బంది రుణగ్రహీతలకు అవగాహన కల్పించి సమయానికి అప్పులు చెల్లించేలా కృషి చేస్తున్నారు.
దీర్ఘకాలిక రుణాల వసూళ్లలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రథమ స్థానం
అప్పులు చెల్లించేలా అవగాహన
కల్పిస్తున్న సొసైటీ సిబ్బంది
రైతులకు అవగాహన కల్పించాం
రుణాల వసూళ్ల కోసం జిల్లా అధికారులు, బ్యాంక్ అధికారుల సహాయంతో సంఘం పరిధిలోని గ్రామాలలో రుణాలు చెల్లిస్తే వడ్డీలో 40 శాతం రాయితీ వస్తుందని రైతులకు అవగాహన కల్పించాం. రుణాల రికవరీలో సహకరించిన సిబ్బందికి, జిల్లా అధికారులకు కృత్ఞతలు.
– హన్మాండ్లు, సొసైటీ కార్యదర్శి, చిన్నకొడప్గల్
కర్షక మిత్ర రుణాలు ఇప్పించాం
దీర్ఘ కాలిక రుణాల వసూళ్లలలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సొసైటీ మొదటి స్థానంలో నిలవడంతో సంతోషంగా ఉంది. దీర్ఘ కాలిక రుణాలు తీసుకున్న రైతుల ఇళ్లకు స్వయంగా వెళ్లి రుణాలు చెల్లించాలని అవగాహ కల్పించా. సంఘంలోని 20 మందికి కర్షక మిత్ర రుణాలు ఇప్పించా.
– నాగిరెడ్డి, సొసైటీ చైర్మన్, చిన్నకొడప్గల్

ఆదర్శం.. చిన్నకొడప్గల్ సొసైటీ

ఆదర్శం.. చిన్నకొడప్గల్ సొసైటీ