
నేటి ర్యాలీని జయప్రదం చేయాలి
నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండల కేంద్రం నుంచి పిట్లం వరకు చేపట్టిన ద్విచక్రవాహన ర్యాలీని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు జయప్రదం చేయాలని పార్టీ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి అన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పుట్టిన రోజును పురస్కరించుకొని ర్యాలీ, అన్నదాన కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. నాయకులు లోక్యానాయక్, రమేష్‌యాదవ్, తోట. రాజు, సాయాగౌడ్, శంకర్ తదితరులున్నారు.
వాహనాల తనిఖీ
పెద్దకొడప్‌గల్(జుక్కల్): మండలంలోని అంజనీ చౌరస్తా జాతీయ రహదారి 161పై శనివారం పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్సై అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలన్నారు.
పార్థి గ్యాంగ్‌పై పీడీ యాక్టు నమోదు
కామారెడ్డి క్రైం: తరచుగా దారి దోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతున్న పార్థి దొంగల ముఠాపై కామారెడ్డి పోలీసులు పీడీ యాక్టు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు శనివారం జారీ చేసినట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. మహారాష్ట్రలోని వార్ధా జిల్లాకు చెందిన చోండా అలియాస్ కూలీ పవార్, జాకీ గుజ్జియా భోంస్లే, హరీష్ పవార్ అలియాస్ హర్ష, అనురాగ్ రత్నప్ప భోంస్లే పార్థి తెగకు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులు. ఈ ముఠా కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలోగల జాతీయ రహదారుల వెంబడి 9చోట్ల దారిదోపిడీలు, దొంగతనాలకు పాల్పడ్డారు. మారణాయుధాలతో రోడ్ల వెంబడి ఆగి ఉన్న వాహనాలను, అందులోని వ్యక్తులను టార్గెట్ చేస్తూ నేరాలకు పాల్పడుతుండేవారు. దీంతో శాంతి భద్రతల దృష్ట్యా వారిపై పీడీ యాక్టు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. కామారెడ్డి రూరల్ సీఐ రామన్ శనివారం నిజామాబాద్ సెంట్రల్ జైలుకు వెళ్లి అక్కడి జైలు అధికారులకు పీడీ యాక్ట్ ఉత్తర్వులు అందజేశారు.

నేటి ర్యాలీని జయప్రదం చేయాలి