నేడు బిచ్కుందకు బండి సంజయ్‌ రాక | Sakshi
Sakshi News home page

నేడు బిచ్కుందకు బండి సంజయ్‌ రాక

Published Wed, Nov 15 2023 12:44 AM

- - Sakshi

నిజాంసాగర్‌: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ బుధవారం జుక్కల్‌ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆయన ముందుగా బిచ్కుంద మండలంలోని పత్లాపూర్‌ హనుమాన్‌ ఆలయానికి చేరుకుంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం అక్కడినుంచి బిచ్కుంద వరకు నిర్వహించే బైక్‌ ర్యాలీలో బండి సంజయ్‌ పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం బిచ్కుంద డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించే పార్టీ ప్రచార సభలో ఆయన మాట్లాడతారని, ప్రజలు కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.

పోలింగ్‌ కేంద్రాల

పరిశీలన

దోమకొండ/బీబీపేట: దోమకొండ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, సంఘమేశ్వర్‌ ప్రభుత్వ పాఠశాల, బీబీపేట మండలంలోని తుజాల్‌పూర్‌లలోని పోలింగ్‌ కేంద్రాలను మంగళవారం జిల్లా ఎన్నికల పరిశీలకుడు ఆర్థూర్‌ వర్చూయీయో పరిశీలించారు. అధికారులతో మాట్లాడి ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్ల గురించి తెలుసుకున్నారు. బీఎల్‌వోల వివరాలు, ఓటరు లిస్ట్‌ను పరిశీలించారు. కొత్త ఓటర్ల వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట తహసీల్దార్‌ సంజయ్‌రావ్‌, ఎస్సై మురళి తదితరులు ఉన్నారు.

‘విద్యార్థులు కష్టపడి

చదవాలి’

ఎల్లారెడ్డి: విద్యార్థులు తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించేంత వరకు కష్టపడి చదవాలని ఎల్లారెడ్డి మున్సిఫ్‌ కోర్టు న్యాయమూర్తి హారిక సూచించారు. మంగళవారం ఎల్లారెడ్డి మోడల్‌ స్కూల్‌లో బాలల దినోత్సవం, విద్యార్థులకు న్యాయచైతన్య సదస్సు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి హారిక మాట్లాడుతూ బాల్య వివాహాలు నేరమన్నారు. ఎవరైనా వేధింపులకు గురి చేసినా, ఇబ్బందులు పెట్టి నా విద్యార్థులు వారి తల్లిదండ్రులకుగానీ ఉపాధ్యాయులకుగానీ తెలపాలని సూచించారు. అనంతరం న్యాయవాదులు సమాచా ర హక్కు చట్టం, చట్టాల గురించి విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో భాగంగా న్యాయమూర్తి పాఠశాల ఆవరణలో మొక్క ను నాటారు. ప్రిన్సిపల్‌ సాయిబాబా, ఏజీపీ శ్రీనివాస్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీకాంత్‌, న్యాయవాదులు పండరి, గోపాల్‌రావు, నవీద్‌, సాయిప్రకాష్‌ దేశ్‌పాండే, ఉపా ధ్యాయులు శశిశంకర్‌, నాగరాజు, శ్రీనివాస్‌, స్రవంతి, అంజిలప్ప, లక్ష్మీనర్సయ్య, గంగాప్రసాద్‌, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.

రేపు సాందీపని కళాశాలలో జాబ్‌ మేళా

కామారెడ్డి టౌన్‌: జిల్లా కేంద్రంలోని సాందీపని డిగ్రీ కళాశాలలో గురువారం ప్రముఖ ఎమ్‌ఎస్‌ఎన్‌ ల్యాబొరేటరీ కంపెనీ ఆధ్వర్యంలో జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల డైరెక్టర్‌ బాలాజీరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌ ఎంపీసీ, బైపీ సీ, ఫార్మాటెక్‌, ఎంఎల్‌టీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు ఈ మేళాకు హాజరుకావాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 91548 29055, 91820 63878 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

రేపు విద్యుత్‌ వినియోగదారుల పరిష్కార వేదిక

కామారెడ్డి అర్బన్‌: కామారెడ్డి సబ్‌ డివిజన్‌లో విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి విద్యుత్‌ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గురువారం ఉద యం 10.30 గంటల నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు కామారెడ్డి తూ ర్పు హౌసింగ్‌ బోర్డు కాలనీ ఫైర్‌స్టేషన్‌ సమీపంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కామారెడ్డి డీఈఈ సాలియా నాయక్‌, ఏడీఈ కిరణ్‌ చైతన్య తెలిపారు. కామారెడ్డి పట్టణ, కామారెడ్డి మండల, తాడ్వాయి మండలాల విద్యుత్‌ వినియోగదారులు వేదిక ద్వారా సమస్యలకు పరిష్కారం పొందాలన్నారు.

1/2

2/2

Advertisement
 
Advertisement