తెలంగాణ ఏర్పాటైతే బొగ్గుబాయి, బొంబాయి | - | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఏర్పాటైతే బొగ్గుబాయి, బొంబాయి

Published Tue, Nov 14 2023 1:02 AM | Last Updated on Tue, Nov 14 2023 6:36 AM

-

● తెలంగాణ ఏర్పాటైతే బొగ్గుబాయి, బొంబాయి , గల్ఫ్‌ దేశాల ఊసెత్తే అవసరముండదని కేసీఆర్‌ ఉద్యమ సమయంలో హామీ ఇచ్చారు. కానీ ఆ హామీలు నెరవేరలేదు. గల్ఫ్‌ వలస కార్మికుల కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసి, దాని ద్వారా తిరిగి వచ్చిన వారికి ఉపాధి చూపాలని, రాష్ట్ర బడ్జెట్‌లో వీరి సంక్షేమం కోసం రూ.500 కోట్లు కేటాయించాలనే డిమాండ్‌ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 2018–19 రూ.100 కోట్లు ప్రకటించి నిధులు నామమాత్రంగా విడుదల చేసింది. గల్ఫ్‌ దేశాల్లో మరణించిన వారి మృతదేహాలను ఇళ్లకు తీసుకొచ్చేందుకు సైతం ఇబ్బంది అవుతోంది. గల్ఫ్‌ యేతర దేశాల్లో మరణించిన వారి మృతదేహాలను రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చుతో తెప్పిస్తోంది. గల్ఫ్‌ మృతుల విషయంలో వివక్ష కనిపిస్తోంది. ప్రవాసీ విధానం, గల్ఫ్‌ బోర్డు ఏర్పడితే ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదనే వాదన బలంగా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement