జల విద్యుదుత్పత్తిలో మరో రికార్డు

విద్యుత్‌ ఉత్పత్తి చేసే టర్బయిన్లు  - Sakshi

బాల్కొండ: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ జల విద్యుదుత్పత్తి కేంద్రం విద్యుత్‌ ఉత్పత్తిలో మరో రికార్డును నెలకొల్పింది. కేంద్రం చరిత్రలో రెండో అతిపెద్ద జల విద్యుత్‌ ఉత్పత్తి 137.95 ఎంయూ రికార్డ్‌ను బ్రేక్‌ చేస్తూ ప్రస్తుతం 138 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి జరిగింది. చరిత్రలో రెండో అతిపెద్ద రికార్డుగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నిలిచింది. శ్రీరాంసాగర్‌లో 1987–88 ఆర్థికసంవత్సరంలో విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభమైంది. కేంద్రం చరిత్రలో 1990–91 ఆర్థిక సంవత్సరంలో 147 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి రికార్డుగా నమోదైంది. రెండో అత్యధికంగా 1998–99 ఆర్థిక సంవత్సరం 137.95 రెండో అతిపెద్ద రికార్డు నమోదైంది. ప్రస్తుతం ఆ రికార్డును బ్రేక్‌ చేస్తూ ఇప్పటి వరకు 138 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగింది. జల విద్యుతుత్పత్తి కేంద్రం చరిత్రలో 2015–16 ఆర్థిక సంవత్సరంలో ఒక్క మిలియన్‌ యూనిట్‌ కూడా ఉత్పత్తి జరగలేదు.

కేంద్రం చరిత్రలో రెండో అతిపెద్ద రికార్డు

ప్రాజెక్ట్‌ చరిత్రలో అత్యధికం

147 ఎంయూ

ప్రస్తుత సంవత్సరం 138 ఎంయూ

మూడు టర్బయిన్‌లతోనే..

శ్రీరాంసాగర్‌ప్రాజెక్ట్‌ జల విద్యుదుత్పత్తి కేంద్రంలో 2010 కంటే ముందు వరకు మూడు ట ర్బయిన్‌ల ద్వారా 27 మెగావాట్ల ఉత్పత్తి జరిగేది. 2010లో నాలుగో టర్బయిన్‌ అందుబాటులోకి వచ్చింది. దీంతో 36 మెగావాట్ల విద్యుతుత్పత్తి ప్రారభమైంది. కానీ 147 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి రికార్డు మూడు ట ర్బయిన్‌ల ద్వారానే జరిగింది. ప్రస్తుతం నాలు గు టర్బయిన్‌లు ఉన్నప్పటికీ అంత స్థాయిలో ఉత్పత్తి జరగక పోవడం లోటుగానే ఉంది. ఈ సంవత్సరం ఎంయూ రికార్డు బ్రేక్‌ అవుతుంద ని జెన్‌కో అధికారులు అంచనా వేశారు. అయితే మూడు రోజులే ఆర్థికసంవత్సరం ముగింపు ఉండడం వలన మరో 9 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరగడం సాధ్యం కాదు. దీంతో రెండో అతిపెద్ద రికార్డు మాత్రమే నెలకొంది.

Read latest Kamareddy News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top