ఎక్కడుంది లోపం!
అన్నవరం: రాష్ట్రంలోని ఏడు ప్రముఖ ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వస్తున్న భక్తులకు ఆయా దేవస్థానాలు అందిస్తున్న సేవలపై ప్రభుత్వం తాజాగా నిర్వహించిన అభిప్రాయ సేకరణలో అన్నవరం దేవస్థానం ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ, శ్రీకాళహస్తి, శ్రీశైలం, కాణిపాకం దేవస్థానాల్లో భక్తులకు అందిస్తున్న సేవలపై ప్రభుత్వం గత అక్టోబర్ 25 నుంచి నవంబర్ 25వ తేదీ వరకూ వాట్సాప్, ఐవీఆర్‌ఎస్ ద్వారా ఈ సర్వే నిర్వహించింది. ఇందులో 72.2 శాతంతో శ్రీకాళహస్తి ప్రథమ, 66 శాతంతో విజయవాడ దేవస్థానం ఏడు స్థానాల్లో నిలిచాయి. అన్నవరం దేవస్థానంలో అందిస్తున్న సేవలపై దాదాపు 32 శాతం మంది భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఏప్రిల్‌లో నిర్వహించిన సర్వేలో అన్నవరం దేవస్థానం ఆఖరు స్థానంలో నిలవడంతో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ స్పందించారు. అన్నవరం దేవస్థానంలో తనిఖీలు చేశారు. మెరుగైన సేవలందించి దేవస్థానాన్ని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలని సిబ్బందిని ఆదేశించారు. ఆ తరువాత కొంత మెరుగుదల కనిపించినా మళ్లీ ఆరో స్థానానికి దిగజారింది. దీంతో, అసలు లోపం ఎక్కడుందనే చర్చ దేవస్థానంలో నడుస్తోంది. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలవడం కూడా దేవస్థానం ప్రతిష్ట మసక బారడానికి కారణంగా చెబుతున్నారు.
తీవ్ర అసంతృప్తి అక్కడే..
ఫ దేవస్థానంలో పారిశుధ్యం, మౌలిక వసతుల కల్పనలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. దీనిపైనే ఎక్కువ మంది భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానంలో శానిటరీ టెండర్ చిత్తూరుకు చెందిన పద్మావతి సంస్థ దక్కించుకుంది. అక్టోబర్ 1 నుంచి ఇది అమలులోకి వచ్చింది. అయితే ఆ సంస్థ దేవస్థానంతో నవంబర్ నెలాఖరున అంటే దాదాపు 55 రోజుల తరువాత ఒప్పందం కుదుర్చుకుంది. ఇంకా పారిశుధ్య సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తి కాలేదు. పాత సిబ్బందిలో సూపర్‌వైజర్లందరినీ తప్పించారు. ప్రజాప్రతినిధుల సిఫారసు మేరకు కొత్తవారిని నియమిస్తున్నారు. ఇందులో పని చేతకాని వారు కూడా సూపర్‌వైజర్లుగా నియమితులవుతున్నారనే విమర్శ వినిపిస్తోంది. ఫలితంగా ఎక్కడికక్కడ అపరిశుభ్రత కనిపిస్తున్నా పట్టించుకున్న నాథుడే లేడు.
ఫ సామాన్యులు కూడా తమ ఇళ్లల్లో దుస్తులను వాషింగ్ మెషీన్లతో ఉతుకుతున్నారు. కానీ, అన్నవరం దేవస్థానం సత్రాల గదుల్లోని మంచాలపై వేసే దుప్పట్లు, గలేబులు తదితర వస్త్రాలను ఇంకా చేత్తోనే ఉతుకుతున్నారు. సాధారణంగా భక్తుడు వసతి గది ఖాళీ చేసిన వెంటనే ఆ దుప్పట్లు మార్చాలి. ప్రస్తుతం అలా జరుగుతోందా అనేది అనుమానమేనని పలువురు అంటున్నారు. గతంలో కేఎల్‌టీసీ సంస్థ శానిటేషన్ కాంట్రాక్ట్ నిర్వహించేటపుడు మెషీన్లతోనే ఉతికేవారు.
ఫ సత్రాల ఆవరణ, బాత్‌రూములు, సత్రాల క్లీనింగ్ వంటి వాటికి ఉపయోగిస్తున్న మెటీరియల్ కూడా కాంట్రాక్టర్ అరకొరగానే సరఫరా చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
ప్రసాదం విషయంలో కొంత ఊరట
స్వామివారి ప్రసాదం విషయంలో 78 శాతం మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేయడం కొంత ఊరట కలిగిస్తోంది. వాస్తవానికి నూరు శాతం భక్తులు సంతృప్తి వ్యక్తం చేయాల్సినంత నాణ్యతగా గోధుమ నూక ప్రసాదం ఉంటుంది. కానీ దీనిపై కూడా అసంతృప్తికి కారణమేమిటనేది ఎవరికీ అర్థం కావడం లేదు. ఎక్కువసేపు దర్శనం క్యూలో నిలుచోవడం.. మౌలిక వసతులు, పారిశుధ్యం సరిగా లేకపోవడం వంటి వాటి వలన కలుగుతున్న అసంతృప్తి ప్రసాదంపై కూడా పడుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మెషీన్లతో ఉతికించాల్సి ఉంది
సత్రాల గదుల్లోని దుప్పట్లను చేత్తోనే ఉతికి ఆరేస్తున్నారు. శానిటేషన్ కాంట్రాక్ట్ పొందిన సంస్థ గత అక్టోబర్ నుంచి ఇలాగే చేస్తోంది. ఆ సంస్థ మెషీన్లతో ఉతికించాల్సి ఉంది. అందుకు అవసరమైన వాషింగ్ మెషీన్లు త్వరలోనే తెస్తామంటున్నారు. వీటిని అమర్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించాం.
– వీర్ల సుబ్బారావు,
ఈఓ, అన్నవరం దేవస్థానం
·˘ A¯]l²Ð]lÆý‡… §ólÐ]lÝ릯]l…Oò³
భక్తుల్లో తగ్గని అసంతృప్తి
·˘ ¯]lÐ]l…ºÆŠ‡ çÜÆó‡ÓÌZ¯]l* õÜÐ]lË$ »êVøÌôæÐ]l¯]l² 32 Ô>™èl… Ð]l$…¨
·˘ Æ>çÙ‰…ÌZ BÆø Ý릯]l…™ø çÜÇ
ఆరు నెలలుగా వివిధ సేవలపై భక్తుల సంతృప్తి శాతం
నెల సత్యదేవుని మౌలిక గోధుమ నూక పారిశుధ్యం
దర్శనం వసతులు ప్రసాదం
జూన్ 73 66 77 70
జూలై 74 65 78 68
ఆగస్ట్ 75.8 64.9 76.9 66.5
సెప్టెంబర్ 74.1 66 79.2 64.5
అక్టోబర్ 68 63 76 63
నవంబర్ 69.7 61.6 77.6 64.2
మొత్తంగా నవంబర్ నెలలో వచ్చిన భక్తుల్లో 67.8 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేయగా 32.2 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. వారి అసంతృప్తి తగ్గించడానికి అధికారులు తీసుకుంటున్న చర్యలు పెద్దగా సత్ఫలితాలనివ్వడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


