జీజీహెచ్‌లో ప్రత్యేక వైద్య సేవలు
స్క్రబ్ టైఫస్ బాధితుల చికిత్సకు కాకినాడ జీజీహెచ్ మెడికల్ వార్డులో నిష్ణాతులైన వైద్య నిపుణులు సేవలందిస్తున్నారు. ఈ వ్యాధి సోకిన వారు ఆందోళనకు గురి కావద్దు. జీజీహెచ్‌లో ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్నాం. కార్పొరేట్ వైద్యాన్ని ఆశ్రయించి, ఆర్థిక భారాన్ని తెచ్చిపెట్టుకోవద్దు. అనుమానితులకు ఆసుపత్రిలోని వీఆర్‌డీఎల్ ల్యాబ్‌లో ఇలీసా టెస్ట్ చేస్తున్నాం. స్క్రబ్ టైఫస్ సోకిన నలుగురు ప్రస్తుతం జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉంది.
– డాక్టర్ లావణ్య కుమారి, సూపరింటెండెంట్, జీజీహెచ్, కాకినాడ
అవగాహనతో అప్రమత్తం
స్క్రబ్ టైఫస్‌పై అవగాహన పెంపొందించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో అజిత్రోమైసిన్, డాక్సీసైక్లిన్ మాత్రలు అందుబాటులో ఉంచాం. విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తున్నాం. నవంబర్ నెలలోనే జిల్లా వ్యాప్తంగా 232 మంది అనుమానితులకు పరీక్షలు చేశాం. దీనిపై భయం వద్దు. అలాగని అతి విశ్వాసం నిర్లక్ష్యానికి దారి తీయవచ్చు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే తక్షణమే స్థానిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలి.
– డాక్టర్ నరసింహ నాయక్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి, కాకినాడ
జీజీహెచ్‌లో ప్రత్యేక వైద్య సేవలు


