ఈ జాగ్రత్తలు మేలు
ఫ రైతులు, అడవుల్లో పని చేసేవారు, వ్యవసాయ కూలీలు, పొదలు, గడ్డి ప్రాంతాల్లో సంచరించేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ సంచరించడం, పని చేయడం అనివార్యమైనప్పుడు శరీరాన్ని పూర్తిగా కప్పే దుస్తులే ధరించాలి.
ఫ చిగ్గర్ మైట్స్ నివారణకు అవసరమైన
పురుగు మందులు పొదలు,
గడ్డి ప్రాంతాల్లో పిచికారీ చేయాలి.
ఫ ఏ ప్రదేశంలోనూ నేలపై
నేరుగా కూర్చోకూడదు.
ఫ ఇల్లు, కార్యాలయాల చుట్టుపక్కల ఉన్న గడ్డి, పొదలు, తుప్పల్ని తొలగించాలి.
ఫ బ్యాక్టీరియా వ్యాప్తికి చల్లదనం, వర్షాలు అత్యంత అనుకూలం. జనవరి నుంచి ఈ కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అప్పటి వరకూ రైతులు, వ్యవసాయ కార్మికులు, ఇతర వర్గాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.


