
పరిశోధనలకు ప్రోత్సాహం ప్రయాస్
ప్రధాన తేదీలు
దరఖాస్తు చేసేందుకు గడువు: ఆగస్టు 17
దరఖాస్తుల స్క్రీనింగ్: సెప్టెంబర్ 15
జ్యూరీ ఎంపిక గడువు: సెప్టెంబర్ 30
ఫలితాల ప్రకటన: అక్టోబర్ 15
ఎంపికై న ప్రాజెక్టుల ప్రారంభం: అక్టోబర్ 16
ప్రాజెక్టు ముగింపు తేదీ: అక్టోబర్ 16, 2026.
రిపోర్టు సబ్మిషన్: అక్టోబర్ 20, 2026.
● దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
● శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించడమే లక్ష్యం
రాయవరం: విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించడానికి, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇన్‌స్ఫైర్ మనాక్, జాతీయ సైన్స్ దినోత్సవం వంటి కార్యక్రమాలను అమలు చేస్తోంది. సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారాలను కనుగొనేందుకు విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మక ఆలోచనలకు పదును పెట్టేందుకు ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంటోంది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ)– ప్రమోషన్ ఆఫ్ రీసెర్చ్ యాటిట్యూడ్ అమాంగ్ యంగ్ అండ్ యాస్పైరింగ్ స్టూడెంట్స్ (ప్రయాస్) పథకాన్ని ఎప్పటి నుంచో అమలు చేస్తోంది. అందులో పరిశోధన ప్రాజెక్టు ప్రతిపాదనలను ఆహ్వానించేందుకు దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది.
అర్హతలు – నిబంధనలు
● ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 9, 10 తరగతులు, ఇంటర్మీడియెట్ ఫస్టియర్ చదువుతున్న అన్ని యాజమాన్యాల పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు దరఖాస్తు చేసుకునే అవకాశముంది. ఒక పాఠశాల నుంచి ఒకరు లేదా ఇద్దరు విద్యార్థులు పాల్గొనవచ్చు. పాఠశాలల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదా గణితం బోధించే పీజీటీ/టీజీటీ ఉపాధ్యాయుడు, ఏదైనా ఒక ఉన్నత విద్యా సంస్థ, పరిశోధన సంస్థ నిపుణుడితో కలిసి పరిశోధన ప్రాజెక్టును సమర్పించాలి.
● ఒక పాఠశాల నుంచి ఒక దరఖాస్తును మాత్రమే పరిశీలిస్తారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వీలుంది. పూర్తి సమాచారాన్ని ఎన్‌సీఈఆర్‌టీ అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించవచ్చు.
● విద్యార్థులకు సైన్స్ ఉపాధ్యాయుడు గైడ్ టీచర్‌గా వ్యవహరిస్తారు. ఉన్నత విద్యాసంస్థల సైన్స్ సబ్జెక్ట్ నిపుణుల నుంచి సాంకేతిక సహకారం, మార్గదర్శకత్వాన్ని విద్యార్థులు పొందవచ్చు.
మంచి ప్రాజెక్టులను ఎంపిక చేసుకోవాలి
ప్రతి పాఠశాల నుంచి విద్యార్థులు ప్రాజెక్టుల రూపకల్పనలో భాగస్వాములు అయ్యే విధంగా సైన్స్ ఉపాధ్యాయులు మార్గదర్శకత్వం చేయాలి. జాతీయ స్థాయిలో ప్రాజెక్టులు ఎంపికవ్వాలంటే సమస్యను ప్రతిబింబించడంతో పాటుగా, మంచి పరిష్కారాన్ని చూపించాలి. ప్రతి ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులను ప్రోత్సహించేందుకు కృషి చేయాలి.
– డాక్టర్ షేక్ సలీం బాషా, జిల్లా విద్యాశాఖాధికారి,
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
ఎంపికై న వారికి రూ.50వేల నగదు
విద్యార్థులు స్థానికంగా ఉన్న ఒక సమస్యను గుర్తించి, దానిని అధ్యయనం చేయాలి. సమస్య పరిష్కారానికి మార్గాలను అన్వేషించాలి. శాసీ్త్రయ పరిశోధన చేసి, సమస్య పరిష్కారానికి మార్గాలు చూపిస్తూ రిపోర్టును సమర్పించాలి. ప్రాజెక్టును ఏడాది లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎన్‌సీఈఆర్‌టీ ఎంపిక చేసిన పరిశోధనకు కేంద్ర ప్రభుత్వం రూ.50వేలు మంజూరు చేస్తోంది. మంజూరైన నిధులను పరిశోధనకు, ప్రాజెక్టు రూపకల్పనకు వినియోగించుకోవచ్చు. పరిశోధన సామగ్రి, ప్రయాణ ఖర్చులకు ఈ నిధులను ఉపయోగించుకోవచ్చు. ఈ నిధుల నుంచి విద్యార్థులకు రూ.10 వేలు, పాఠశాల ఉపాధ్యాయులు, ఉన్నత విద్యాసంస్థ సబ్జెక్టు ఎక్స్‌పర్ట్‌కి రూ.20 వేల వంతున అందజేస్తారు.

పరిశోధనలకు ప్రోత్సాహం ప్రయాస్

పరిశోధనలకు ప్రోత్సాహం ప్రయాస్