
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
అన్నదమ్ముల మధ్య విభేదాలతో మనస్తాపం
నిడదవోలు: పెరవలి మండలం ఉసులుమర్రు గ్రామానికి చెందిన తానేటి శ్రీనివాస్ (42) ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. అన్నదమ్ముల మధ్య ఏర్పడ్డ చిన్నపాటి విభేదాలతో మనస్తాపం చెందిన శ్రీనివాస్ ఈనెల 8న పురుగు మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాధితుడిని వెంటనే కుటుంబ సభ్యులు తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న శ్రీనివాస్‌కు భార్య భాగ్యలక్ష్మితో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెరవలి ఎస్సై ఎం. వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.