
సంపద సృష్టి.. రాబడి నష్టి!
లక్ష్యానికి దూరంగా..
2024–25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయాన్ని చూస్తే ఏ ఒక్క సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం 60 శాతం లక్ష్యాన్ని కూడా అధిగమించ లేక చతికిలపడ్డాయి. భూముల విలువను అడ్డంగా పెంచేసిన చంద్రబాబు ప్రభుత్వం జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్‌శాఖకు నిర్ధేశించిన లక్ష్యంగా రూ.615.32 కోట్లు. వచ్చిన ఆదాయం చూస్తే రూ.335.97 కోట్లు మాత్రమే నమోదైంది. 54.44 శాతం ఆదాయాన్ని మాత్రమే జిల్లాలో సంబంఽధిత శాఖ రాబట్టగలిగింది. అదే 2023–24 ఆర్థిక సంవత్సరంలో చూసుకుంటే ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యం రూ. 544.27 కోట్లు. వచ్చిన ఆదాయం రూ.329.97 కోట్లు నమోదైంది. అప్పట్లో ఆదాయ వృద్ధి 60.63 శాతంగా నమోదైంది.
ప్రభుత్వం భూమి విలువలు పెంచినప్పటికీ జిల్లాలో ఉన్న తొమ్మిది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆదాయ పరంగా బాగా వెనుకబడ్డ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంగా పెద్దాపురం నిలిచింది. ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో రూ.39.87 కోట్ల ఆదాయం రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకుంటే రూ.18.44 కోట్లతో కేవలం 46.26 శాతానికే పరిమితమవ్వడంతో ఆశ్చర్యపోవడం ఆ కార్యాలయ ఉద్యోగుల వంతైంది. ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో కేవలం 5,076 లావాదేవీలు మాత్రమే జరగడం గమనార్హం. కొద్దిగా అటు ఇటుగా మిగిలిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి. చంద్రబాబు ప్రభుత్వం సంపద సృష్టి అంటూ ప్రజలపై భారం మోపడం తప్ప రిజిస్ట్రేషన్‌లలో ఏమాత్రం వృద్ధి సాధించలేదని సంబంధితశాఖ ఉద్యోగులు విశ్లేషిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు విజన్ రిజిస్ట్రేషన్ శాఖకు శాపమై కూర్చుంది. ఆర్థికంగా బలోపేతం చేస్తానంటూ భూముల విలువ అడ్డంగా పెంచేసి ప్రజల నెత్తిన భారం మోపారు. పోనీ భూముల విలువ పెంపుతో రిజిస్ట్రేషన్‌శాఖ ఆదాయం ఏమైనా పెరిగిందా అంటే అదీ లేదు. రిజిస్ట్రేషన్‌లు పెరగడం మాట దేవుడెరుగు ఆదాయం అడ్డంగా పడిపోయింది. అనుకున్నదొక్కటి అయిన దొక్కటి మొత్తానికి మొదటికే మోసం వచ్చిందంటూ రిజిస్ట్రేషన్ శాఖ తల పట్టుకుంటోంది. భూముల విలువ పెంపుతో కాకినాడ జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖకు ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుందని వేసుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా 2024–25 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యాలు అధిగమించలేక చతికిలపడ్డాయి. కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అయితే కనీసం 50 శాతం లక్ష్యాలను కూడా చేరుకోలేక వెనకపడ్డాయి. చంద్రబాబు సంపద సృష్టి అనే నినాదం మాటేమోకానీ తమకు గుదిబండగా మారిందని భూముల క్రయవిక్రయదారులకు గగ్గోలు పెడుతున్నారు. నిర్ధేశించిన ఆర్థిక లక్ష్యాలు సాధించలేక యంత్రాంగం చేతులెత్తేయక తప్పింది కాదు. భూముల విలువ పెంపుతో భారమే తప్ప ఏ ఒక్కరికీ ఎటువంటి ప్రయోజనం కలగలేదని రిజిస్ట్రేషన్‌శాఖ ఉద్యోగులే పెదవి విరుస్తున్నారు. గత ప్రభుత్వంలో భూముల ధరలు స్వల్పంగా పెంచింది. కూటమి గద్దె నెక్కాక భూమి విలువలను భారీగా పెంచడంతో గత ఆర్థిక సంవత్సరం కంటే తక్కువ దస్తావేజులు రిజిస్ట్రేషన్ అయ్యాయి. ప్రజలు భూములు కొని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ప్రభుత్వానికి చెల్లించే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ చార్జీల వడ్డన భారీగా ఉండటంతో తక్కువ రిజిస్ట్రేషన్‌లు జరుగుతున్న పరిస్థితి కనిపించింది. గత ఆర్థిక సంవత్సరం కంటే ఈ ఏడాది 589 తక్కువ దస్తావేజులు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో జిల్లావ్యాప్తంగా 91,946 రిజిస్ట్రేషన్‌లు జరిగితే ఈ ఆర్థిక సంవత్సరంలో 91,357 రిజిస్ట్రేషన్‌లు మాత్రమే జరిగాయి.
అనుకున్నదొక్కటి అయినదొక్కటి
కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ పరిధిలో తొమ్మిది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. తొమ్మిది రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఏ ఒక్కటీ ప్రభుత్వం 2024–25 ఆర్థిక సంవత్సరానికి నిర్థేశించిన లక్ష్యాన్ని సాధించలేదు. మెజార్టీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల అధికారులు 50శాతం ఆదాయాన్ని కూడా చూడలేక పోయామంటున్నారు. జిల్లాలో భూ విలువల సవరణలతో చాలా ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ధరలు పెరిగాయి. ధరలు పెరగడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను సులువుగా చేరుకోవచ్చునని సంబంధిత శాఖ అంచనా వేసుకుంది. లక్ష్యాలను అధిగమిస్తాయనుకున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు వెనుకబడటంతో శాఖ ఉన్నతాధికారులు లబోదిబోమంటున్నారు. ఆర్థిక సంవత్సరం మార్చి నెల ముగిసే సరికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా లెక్కలు తీసి చూస్తే చంద్రబాబు సంపద సృష్టి మాటేమో కానీ అనుకున్నదొకటి అయినదొక్కటి అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చిచూస్తే భూముల విలువ భారీగా పెంచినా ఆ స్థాయిలో ఆదాయం నమోదు కాలేదంటున్నారు. క్రయ, విక్రయాలు తగ్గుముఖం పట్టడం చూసి స్థిరాస్థి రంగంలో విశేషమైన అనుభవం కలిగిన వారు మదనపడుతున్నారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో ఇంతలా భారీగా భూ విలువలు పెంచకున్నా పిఠాపురం, సామర్లకోట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు నిర్ధేశించిన లక్ష్యాలను 70శాతం అఽధిగమించడం గమనార్హం.
బోల్తా కొట్టిన ‘బాబు’ విజన్
ప్రజలకు భారం...ఆదాయం ఘోరం
నీరుగారిన సర్కార్ లక్ష్యాలు
పడకేసిన రిజిస్ట్రేషన్‌లు
స్పష్టం చేసిన మార్చి నివేదికలు
2023–14లో రిజిస్ట్రేషన్‌లు
91,946
2024–25లో రిజిస్ట్రేషన్‌లు
91,357
60 శాతం లక్ష్యాన్ని
అధిగమించలేకపోయాయి
నిర్ధేశించిన లక్ష్యం
రూ.615.32 కోట్లు
సాధించిన ఆదాయం
రూ.335.97 కోట్లు
2024–2025 ఆర్థిక సంవత్సరంలో..
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం లక్ష్యం ఆదాయం శాతం మొత్తం
కోట్లలో.. కోట్లలో.. డాక్యుమెంట్లు
కాకినాడ (జిల్లా రిజిస్ట్రార్) రూ.196.96 రూ.105.19 53.14 17,778
సర్పవరం రూ.88.89 రూ. 49.71 55.92 5,263
పిఠాపురం రూ. 57.65 రూ. 32.74 56.80 11,060
తుని రూ.61.50 రూ.35.36 57.50 15.199
సామర్లకోట రూ.62.29 రూ.33.42 53.66 10,439
పెద్దాపురం రూ.39.87 రూ.18.44 46.26 5,076
ప్రత్తిపాడు రూ.45.51 రూ.23.43 51.48 10,447
జగ్గంపేట రూ.25.80 రూ.14.98 58.07 5,987
తాళ్లరేవు రూ.36.82 రూ.21.69 58.90 10,108
2023–2024 ఆర్థిక సంవత్సరంలో..
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లక్ష్యం ఆదాయం శాతం మొత్తం
కోట్లలో కోట్లలో డాక్యుమెంట్లు
కాకినాడ (జిల్లా రిజిస్ట్రార్) రూ.185.95 రూ.96.60 51.951 8,502
సర్పవరం రూ.69.68 రూ. 48.67 69.86 5,735
పిఠాపురం రూ. 46.38 రూ. 32.86 70.87 12,155
తుని రూ.56.08 రూ.34.73 61.94 13,946
సామర్లకోట రూ.48.37 రూ.35.66 73.73 10,622
పెద్దాపురం రూ.36.64 రూ.21.84 59.60 6,001
ప్రత్తిపాడు రూ.42.00 రూ.25.48 60.68 11,713
జగ్గంపేట రూ.23.79 రూ.13.15 55.29 7,446
తాళ్లరేవు రూ.35.35 రూ.20.93 59.21 7,446

సంపద సృష్టి.. రాబడి నష్టి!