అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

May 14 2026 12:37 AM | Updated on May 14 2026 12:37 AM

ధరూరు/మల్దకల్‌: నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ఓ వరమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం ధరూరు మండలం మార్లబీడు, మల్దకల్‌ మండలంలోని మల్లెందొడ్డి, మద్దెలబండ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించి.. లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దశాబ్దాల తరబడి సొంతిల్లు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న పేదల కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ దశల వారీగా ఇళ్లను నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గద్వాల నియోజకవర్గంలో మొదటి విడతగా 3,500 ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తిచేసుకోవాలని సూచించారు. కార్యక్రమాల్లో రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్‌ చైర్మన్‌ గట్టు తిమ్మప్ప, మాజీ ఎంపీపీ విజయ్‌, మాజీ సర్పంచ్‌ శ్రీరాములు, జంబు రామన్‌గౌడు, రాజారెడ్డి, విజయ్‌, సత్యారెడ్డి, సురేందర్‌రెడ్డి, పెద్దవీరన్న, నారాయణ, రామాంజనేయులు, వెంకటన్న, రంగన్న, శేఖర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement