మూడేళ్ల తర్వాత మార్కెట్‌లో మంచి ధరలు
● అధిక ఉష్ణోగ్రతలతో పెరిగిన డిమాండ్
● ఈసారి దిగుబడులు తగ్గినా రైతులకు ఊరట
● జిల్లావ్యాప్తంగా 8,481 ఎకరాల్లో బత్తాయి సాగు
మల్దకల్
3,276
అయిజ
608
ధరూరు
1,364
గద్వాల
798
గట్టు
1,557
ఇటిక్యాల
262
కేటీదొడ్డి
308
రాజోళి
121
వడ్డేపల్లి
68
ఎర్రవల్లి
93
అలంపూర్ 10
మానవపాడు 3
ఉండవల్లి 13
గద్వాల వ్యవసాయం: బత్తాయి తోటల రైతులకు ఈసారి కాస్త కలిసొచ్చింది. జిల్లాలో కొంత వాతావరణం అనుకూలించక దిగుబడులు తగ్గినా.. కొన్ని రోజులుగా వస్తున్న ధరలు ఊరటనిస్తున్నాయి. మూడేళ్లుగా బత్తాయి పండ్లకు పెద్దగా ధరలు రాలేదు. దీంతో కొంత నిరాశ నిస్పృహాల్లో ఉన్న రైతులకు ఇరవై రోజులుగా మంచి ధరలు వస్తుండటంతో సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
జిల్లాలో ఇలా..
పండ్లతోటల సాగుకు నడిగడ్డలో నేలలు అనుకూలంగా ఉన్నాయి. వాతావరణ పరిస్థితులు కూడా సాధారణంగా బాగుంటాయి. ఇక్కడి రైతులు 15ఏళ్లుగా బోర్లు, బావుల కింద పండ్లతోటలు సాగుచేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లావ్యాప్తంగా 8,481 ఎకరాల్లో బత్తాయి తోటలు వేశారు. అందులో ఎక్కువగా జంబేరీ, రంగాపూర్ రకాలను సాగుచేశారు. ఈ తోటల సాగు కోసం ఎకరాకు రూ. 18వేల నుంచి రూ. 20వేల వరకు ఖర్చు అవుతుంది. ఏటా రెండుసార్లు కాపు వస్తుంది. ఏప్రిల్, మే నెలలో ఒకసారి, సెప్టెంబర్, అక్టోబర్‌లో రెండోసారి కాపు వస్తుంది. వాతావరణ పరిస్థితులు మంచిగా అనుకూలిస్తే, ఎకరాకు 8 నుంచి 10 టన్నుల దిగుబడి వస్తుంది. అయితే మిగిలిన పండ్ల తోటలతో పోల్చితే బత్తాయి తోటలకు పెట్టుబడులు ఎక్కువే. అదే సమయంలో నిర్వహణ కూడా ఎక్కువగానే ఉంటుంది.


