జాతీయస్థాయి పోటీల్లో రాణించాలి | - | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయి పోటీల్లో రాణించాలి

May 13 2026 12:50 AM | Updated on May 13 2026 12:50 AM

గద్వాలన్యూటౌన్‌/మల్దకల్‌: జిల్లా క్రీడాకారులు జాతీయస్థాయి క్రీడా పోటీల్లో రాణించి మంచి పేరు తెచ్చుకోవాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సూచించారు. ఈ నెల 10న హనుమకొండలో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో అండర్‌–18 విభాగంలో జిల్లా క్రీడాకారులు దినేష్‌, రాహుల్‌ అత్యుత్తమ ప్రతిభకనబరిచి పతకాలు సాధించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారిని శాలువాతో సత్కరించి అభినందించారు. అదే విధంగా మల్దకల్‌ మండలకేంద్రంలో జములమ్మ ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. స్థానిక గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాల్లో జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బీసన్న, ఉపాధ్యక్షుడు వెంకట్రాములు, సంయుక్త కార్యదర్శి నాగేష్‌, కార్యదర్శి సతీష్‌కుమార్‌, సర్పంచ్‌ చిట్టెమ్మ, శ్రీధర్‌గౌడ్‌, రాజారెడ్డి, విక్రమ్‌సింహారెడ్డి, ఆలయ చైర్మన్‌ ప్రహ్లాదరావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement