అందుబాటులోకి ఎస్టీపీ
ప్లాంట్..
యూనివర్సిటీలో రూ.113 కోట్లతో కొనసాగుతున్న పనులు
● శరవేగంగా నూతన భవనాల
నిర్మాణాలు
● ఈ విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి రీసెర్చ్ ఫెసిలిటీ భవనం
● సీవేజ్ వాటర్ ట్రీట్‌మెట్ ప్లాంట్,
సింథటిక్ ట్రాక్ గ్యాలరీ
● ప్రారంభమైన లా, ఇంజినీరింగ్ కళాశాల భవనాలు
ఎమ్మెల్యేను సన్మానిస్తున్న పీఏసీఎస్ అధ్యక్షుడు మద్దిలేటి
పీయూలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య, మంచి వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరంలో పలు కొత్త భవనాలు అందుబాటులోకి రానున్నాయి. పలు హాస్టళ్లు, లా, ఇంజినీరింగ్ కళాశాలల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఎస్టీ పీ ప్లాంట్, సింథటిక్ ట్రాక్ గ్యాలరీ కూడా పూర్తయ్యాయి. పీయూను గొప్ప యూనిర్సిటీగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నాం.
– జీఎన్ శ్రీనివాస్, వైస్ చాన్స్‌లర్, పీయూ
పీయూలో కొనసాగుతున్న
అభివృద్ధి పనులు ఇలా..
నిధులు (రూ.కోట్లలో..)
నిర్మాణం పూర్తి చేసుకున్న
పీయూ సింథటిక్ ట్రాక్ గ్యాలరీ
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. పలు అభివృద్ధి పనులకు అటు ప్రభుత్వం, ఇటు యూనివర్సిటీ అంతర్గత నిధులు వెచ్చించి విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో గతంలో ఎప్పుడూ లేనంతంగా ఏకంగా రూ.113.63 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఇందులో పలు నిర్మాణాలు చివరి దశకు చేరుకోగా.. మరికొన్ని నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ప్రస్తుతం వేసవి సెలవులు ఉండగా.. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం వరకు పలు భవనాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే లా, ఇంజినీరింగ్ కళాశాలల భవన నిర్మాణం ప్రారంభం కావడంతో పీయూ కొత్త అధ్యాయం మొదలుకానుంది. ఒకేసారి నాలుగు హాస్టళ్లు నిర్మిస్తుండటంతో విద్యార్థులకు వసతి సమస్య తీరనుంది.
దక్షిణ తెలంగాణకు రీసెర్చ్ హబ్‌గా..
పీఎం ఉషా స్కీం ద్వారా రీసెర్చ్ ఫెసిలిటీ భవనాన్ని రూ.13.50 కోట్లతో నిర్మించారు. ఇది దక్షిణ తెలంగాణలోనే అతిపెద్ద రీసెర్చి హబ్‌గా అవతరించనుంది. ప్రస్తుతం నిర్మాణం చివరి దశలో ఉంది. దీని ద్వారా పీయూలోని అన్ని డిపార్ట్‌మెంట్లకు ఒక్కో రీసెర్చ్ ల్యాబ్‌ను కేటాయించనున్నారు. ముఖ్యంగా సైన్స్ డిపార్ట్‌మెంట్‌లకు సంబంధించి ప్రత్యేక ల్యాబ్‌లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఉషా స్కీం నుంచి రూ.కోట్లు వెచ్చించి మైక్రోస్కోప్, స్పెక్రోస్కోప్ వంటివి ఏర్పాటు చేయనున్నారు. సైన్స్ పరికరాల కొనుగోలుకు సైతం ఇప్పటికే టెండర్లు పిలిచారు.
తీరనున్న హాస్టల్ సమస్యలు...
యూనివర్సిటీలో మొత్తం 13 కోర్సుల్లో విద్యార్థులు చదువుతున్నారు. అయితే పూర్తిస్థాయిలో సీట్లు సరిపోకపోవడంతో విద్యార్థి అడ్రస్ నుంచి ఉన్న దూరం ఆధారంగా సీట్ల కేటాయింపులు చేస్తున్నారు. వీటికి తోడు లా, ఇంజినీరింగ్ కళాశాలలు కూడా కొత్తగా రావడంతో ఇక్కడ అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ప్రస్తుతం ఉన్న పాత బాలబాలికల హాస్టళ్లలోనే వసతి కల్పిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి రెండు కళాశాలలకు సంబంధించిన విద్యార్థుల సంఖ్య రెట్టింపు కానుండటంతో పీయూలో ఒకేసారి నాలుగు హాస్టళ్లు నిర్మిస్తున్నారు. రెండు హాస్టళ్లు యూనివర్సిటీ ద్వారానే నిర్మిస్తుండగా ఒక బాలిక, ఒక బాలుర హాస్టల్స్‌ను ఎస్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న హాస్టళ్లకు వీటితో సీట్లు రెట్టింపు కానున్నాయి.
బాలుర హాస్టల్ 12.50
రీసెర్చి ఫెసిలిటీ
భవనం 13.50
ఎస్టీ బాలుర హాస్టల్ 10
బాలికల హాస్టల్ 12.50
ఎస్టీ బాలికల
హాస్టల్ 10
లా
కళాశాల 10
సీవేజ్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ 5
ఇంజినీరింగ్ కళాశాల 35
సింథటిక్ ట్రాక్‌లో
టైల్స్‌వర్స్ 0.53
సింథటిక్ ట్రాక్
గ్యాలరీ 4.60
పీయూలో సాధారణ భవనాలతో పాటు అత్యాధునిక టెక్నాలజీని వినియోగించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పీయూలో హాస్టళ్లు, ఆఫీస్‌ల నుంచి వృథాగా వచ్చే నీటిని ఎస్టీపీ (సీవేజ్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్)లో ఫిల్టర్ చేసి తిరిగి వినియోగించేందుకు ఈ ప్లాంట్ ఎంతో ఉపయోగపడనుంది. దీని ద్వారా నీటి వృథా అరికట్టడంతోపాటు నీటి ఎద్దడి, డ్రెయినేజీ సమస్య కూడా తీరనుంది. న్యాక్ గ్రేడింగ్‌లో కూడా దీనికి మార్కులు వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు దక్షిణ తెలంగాణలో ఉన్న ఏకై క సింథటిక్ ట్రాక్ పీయూలో మాత్రమే అందుబాటులో ఉండగా దానికి గ్యాలరీ నిర్మాణం పనులు పూర్తి కావొచ్చాయి. దీని నిర్మాణం కోసం అధికారులు రూ.4.60 కోట్లు వెచ్చించారు.


