తీవ్ర మానసిక ఒత్తిడిలో యువత, మధ్యవయస్కులు
–8లో u
ప్రస్తుత సమయంలో చాలామందికి ఈ వ్యాధి లక్షణాలపై పెద్దగా అవగాహన లేకపోవడం సమస్యగా మారిందని వైద్యులు చెబుతున్నారు. ఉన్నట్టుండి శరీరం బిగుసుకుపోవడం, మూతి వంకర తిరగడం, కాళ్లు, చేతులు చచ్చుబడి పోవడం, ఒక్కోసారి గుండె కూడా పని చేయకపోవడం ఇలా శరీరంలో ప్రతి అవయంపై ప్రభావం చూపుతున్న వ్యాధి పక్షవాతం. అప్పటి వరకు ఆనందంగా సాగిపోతున్న వారి జీవితాలను అకస్మాత్తుగా కుప్ప కూల్చేస్తోంది. వారి బతుకులను ఉన్నట్లుండి అంధకారంలో నెట్టేస్తోంది. పక్షవాతానికి గురైన కొందరు దివ్యాంగులుగా మిగిలిపోయి.. తీవ్ర అవస్థలు పడుతున్నారు.
మారిన ఆహారపు అలవాట్లు, రక్తపోటు, మధుమేహం, వ్యాధి లక్షణాలను గుర్తించక పోవడం ప్రధానంగా ఉన్నాయి. మద్యం, సిగరెట్లు తాగే వారికి పక్షవాతం సోకే ప్రమాదం అధికంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో గంటల తరబడి సెల్‌ఫోన్లు చూడటం, రీల్స్, గేమ్స్ అంటూ సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెట్టడం వంటి విషయాలపై ఉంటూ సమయానికి తినకపోవడం సమస్యగా ఉంది. గతంలో ఎక్కువగా వృద్ధులు ఈ వ్యాధి బారిన పడేవారు. ఇప్పుడు పాతికేళ్లలోపు వారూ ఉండటం ఆందోళన కలిగిస్తోందని వైద్యులు పేర్కొంటున్నారు.
అలంపూర్
గద్వాల క్రైం: మారిన జీవనశైలి కారణంగా సగటు మనిషి ప్రమాదంలో పడిపోతున్నాడు. ఆహారపు అలవాట్లు, రక్తపోటు, మధుమేహాన్ని నియంత్రించుకోవడంలో నిర్లక్ష్యం, వ్యాధి లక్షణాలను ముందుగా గుర్తించకపోవడం, సరైన సమయంలో తగిన వైద్యం తీసుకోకపోవడంతో పలువురు పక్షవాతం బారిన పడుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 898 మంది ఈ వ్యాధి బారినపడ్డారు. అయితే ఇందులో 15 శాతం యువత సైతం ఈ వ్యాధి లక్షణాలతో సతమతం అవుతున్నట్లు జిల్లా వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు. మరోవైపు 40 ఏళ్ల వారు గత కొన్ని నెలల క్రితం మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు కలవరపడుతున్నారు. దీంతో జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు పక్షవాతం కేసులపై సర్వే చేపట్టి వ్యాధిగ్రస్తులను గుర్తించి జిల్లా ఆస్పత్రిలో ప్రత్యేక వైద్య సదుపాయాలు అందిస్తున్నారు. ఒత్తిడితో కూడిన జీవనం, మద్యపానం, ధూమపానం, నిద్రలేమి వంటి సమస్యలతో మెదడు మొద్దుబారిపోతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు తమవారి ఆరోగ్య సమస్యలపై భయాందోళన చెందుతున్నారు.
నిత్యం అనారోగ్య సమస్యలతో ఉక్కిరిబిక్కిరి
అవగాహన లోపంతో తీవ్రమవుతున్న
ఇబ్బందులు
భయాందోళనలో కుటుంబ సభ్యులు
మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లతో ప్రమాదం
మండలానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తికి అకస్మాత్తుగా కుడిచేయి పని చేయలేదు. వెంటనే కుటుంబ సభ్యులు సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పరీక్షించిన వైద్యులు పక్షవాతం వచ్చినట్లు నిర్ధారించారు. అయితే సకాలంలో ఆస్పత్రికి వచ్చినందున పెను ప్రమాదం తప్పిందని.. అయినప్పటికీ నిత్యం మందులు వాడాలని సూచించారు. దీంతో సదరు వ్యక్తి వ్యాధిబారి నుంచి త్వరగా బయటపడాలని బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.


