ఆర్థిక సంవత్సరం బ్యాంకులకు నిర్దేశించిన పంటరుణ పరిమితి మేరకు రైతులకు రుణాలు అందిస్తాయి. అందులో భాగంగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వానాకాలం, యాసంగి రెండు సీజన్‌లకు రుణ లక్ష్యాన్ని లీడ్ బ్యాంక్ అధికారులు నిర్దేశించారు. ఈ మేరకు ఆయా బ్యాంకుల వారీగా లక్ష్యాన్ని విభజించారు. అయితే ఇచ్చిన లక్ష్యంలో కేవలం 68.92 శాతం మాత్రమే బ్యాంకర్లు రైతులకు పంట రుణాలు అందించారు.
అర్హులందరికీ రుణాలు..
2025–26 ఆర్థిక సంవత్సరంలో పంట పెట్టుబడుల కోసం అర్హత కలిగి, రుణం కోరిన రైతులందరికీ ఎలాంటి జాప్యం లేకుండా రుణాలు అందించాం. రుణ లక్ష్యం నెరవేరేలా బ్యాంకర్లతో సమీక్షలు నిర్వహించాం. అర్హులైన ప్రతి రైతుకు పంట రుణాలు అందించేలా చర్యలు తీసుకున్నాం.
– శ్రీనివాసరావు, ఎల్‌డీఎం
●


