లక్ష్యం.. నిర్లక్ష్యం! | - | Sakshi
Sakshi News home page

లక్ష్యం.. నిర్లక్ష్యం!

May 9 2026 7:32 AM | Updated on May 9 2026 7:32 AM

గద్వాలన్యూటౌన్‌: నడిగడ్డ వ్యవసాయ ఆధారిత జిల్లా. ఇక్కడ వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. జూరాల, ఆర్డీఎస్‌ ప్రాజెక్టులతో పాటు, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద ఏడు రిజర్వాయర్లు, వందకు పైగా చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటికి అదనంగా బోరుబావులను కూడా ఇక్కడి రైతులు ఏర్పాటు చేసుకున్నారు. ఏటా రెండు సీజన్‌లలో దాదాపు 5లక్షల ఎకరాల వరకు వివిద రకాల పంటలు పండిస్తున్నారు. ఇంకా పండ్లతోటలు, కూరగాయల సాగు చేపడుతున్నారు.

ప్రతి ఏటా 60 – 70 శాతమే..

నడిగడ్డలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. జిల్లావ్యాప్తంగా సన్న, చిన్నకారు రైతులు వేల సంఖ్యలో ఉండగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రైతుభరోసా, పీఎం కిసాన్‌ సమ్మాన్‌నిధి వంటి పంట పెట్టుబడుల పథకాలు రైతుల పూర్తి అవసరాలు తీర్చడం లేదు. దీంతో వీరంతా బ్యాంకులు అందించే పంట రుణాలనే పంట పెట్టుబడులకు వినియోగిస్తూ.. సేద్యం చేస్తున్నారు. అయితే ప్రతి ఏటా పంటరుణ లక్ష్యం నెరవేరడం లేదు. నిర్దేశించిన లక్ష్యంలో 60 నుంచి 70శాతం మాత్రమే బ్యాంకర్లు రుణాలు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే, రెన్యువల్‌ చేసుకుంటే అర్హత కలిగిన ప్రతి రైతుకు పంట రుణాలు అందిస్తామని బ్యాంకర్లు అంటున్నారు. అయితే రెన్యువల్‌ చేసుకునే విషయంలో రైతులకు సరైన అవగాహన ఉండటం లేదు. దీంతో చాలా మంది రైతులు అధిక వడ్డీకి ప్రైవేటు వ్యాపారులతో అప్పులు చేస్తున్నారు. బ్యాంకు రుణాలు రెన్యువల్‌ చేసుకునే విధానాలపై వ్యవసాయ, బ్యాంకర్లు సంయుక్తంగా రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

అదరగొడుతున్నారు

పాలమూరు స్టేడియంలో నిర్వహిస్తున్న హ్యాండ్‌బాల్‌ శిక్షణ శిబిరంలో క్రీడాకారులు మెళకువలు నేర్చుకుంటున్నారు.

–8లో u

జిల్లాలో 68.92శాతం మాత్రమే పంట రుణాలు

సాగు పెట్టుబడులకు

తప్పని ప్రైవేటు అప్పులు

బ్యాంకు రుణాల రెన్యువల్‌పై

కొరవడిన అవగాహన

బ్యాంకర్ల తీరుతో రైతులకు చేకూరని లబ్ధి

Advertisement
 
Advertisement
Advertisement