30 పడకల ఆస్పత్రి నిర్మా ణం ప్రారంభించి సంవత్సరాలు గడుస్తున్నా పను లు పూర్తికావడం లేదు. దీంతో అనేక అవస్థలు పడుతున్నాం. రోజు పీహెచ్‌సీకి వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. అసంపూర్తిగా నిలిచిన 30 పడకల ఆస్పత్రి నిర్మాణం పూర్తిచేస్తే బాగుంటుంది. – నాగరాజు, అయిజ
పీహెచ్‌సీ భవనం పక్కన నిర్మిస్తున్న 30 పడకల ఆస్ప త్రి పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియడం లేదు. సంవత్సరాలు గడుస్తున్నా అధికారులు, పాలకులు ప ట్టించుకోకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గు రవుతున్నారు. అధికారులు చూసి వెళ్తున్నారు తప్ప..పనులను మాత్రం పూర్తి చేయించడం లే దు.ఇప్పటికై నా స్పందించి త్వరగా పూర్తిచేయాలి.
– నజీర్, అయిజ
అయిజ పీహెచ్‌సీకి ఎక్కువ సంఖ్యలో రోగులు వస్తుంటారు. ఎక్కువ కాన్పులు కూడా ఇక్కడే నిర్వహిస్తున్నారు. నూతనంగా చేపట్టిన 30 పడకల ఆస్పత్రి భవనం అసంపూర్తిగా ఉంది. నిర్మాణ పనుల పూర్తికి అవసరమైన నిధుల కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తాం. నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ భవనాన్ని ప్రత్యేక వార్డుగా వినియోగిస్తాం.
– సంధ్యా కిరణ్మయి,
డీఎంహెచ్‌ఓ
●


