ఐక్య పోరాటాలతోనే సమస్యల పరిష్కారం
గద్వాలటౌన్: అన్ని రంగాలలో ఉన్న కార్మికులు చేసే ఐక్య, సమరశీల పోరాటాల ద్వారానే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి అన్నారు. సోమవారం ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో జరిగిన సీఐటీయూ ముగింపు మహాసభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల వలన శ్రమ దోపిడీ పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా కార్మికుల ఆదాయం పెంచే చర్యలు ఏమాత్రం చేయడం లేదని విమర్శించారు. విధానాలను అమలు చేయడంలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు పెద్ద తేడా లేదన్నారు. ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలపై ఉద్యమించాల్సిన అవసరం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు వెంకటస్వామి, పరంజ్యోతి, దేవదాసు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం ఎన్నిక..
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడిగా ఉప్పేర్ నర్సింహ, ప్ర ధాన కార్యదర్శిగా వీవీ నర్సింహ, కోశాధికారిగా గట్ట న్న, ఉపాధ్యక్షులుగా ఏమేలమ్మ, వెంకటేశ్వర్లు, ఈశ్వ ర్ సహాయ కార్యదర్శులుగా సునీత, తిమ్మప్ప, రామకృష్ణతో పాటు 13 మంది కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఎన్నిక అనంతరం పలు తీర్మాణాలు చేశా రు. జిల్లాలో ఈఎస్‌ఐ డిస్పెన్సరీని ఏర్పాటు చేయాలని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని రెగ్యూలర్ చేయాలని తదితర తీర్మాణాలను ప్రకటించారు.


