ఆ జీపీలు ఏకగ్రీవమే..!
14 గ్రామాల్లో సర్పంచ్‌లు, వార్డులకు ఒక్కో నామినేషన్
అక్కడక్కడ ‘కండువా’ లొల్లి..!
ప్రస్తుతం ఏకగ్రీవం దిశగా అడుగులు వేసిన జీపీల్లో సర్పంచ్‌లు, వార్డుసభ్యులు అధిక సంఖ్యలో కాంగ్రెస్ మద్దతు దారులేనని తెలుస్తోంది. అయితే చాలాచోట్ల గ్రామాల పెద్దలు స్వతంత్రంగా నిర్ణయం తీసుకుని ఏకగ్రీవం దిశగా అడుగులు వేశారు. ఈ క్రమంలో అక్కడక్కడ ‘కండువాల’ లొల్లి చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం లక్ష్మీదేవిపల్లిలో సర్పంచ్‌గా బంగారయ్య శనివారం ఒక్కరే నామినేషన్ వేయగా.. ఆయన వద్దకు పలువురు కాంగ్రెస్ నాయకులు వెళ్లి పార్టీ కండువా కప్పారు. ఆ తర్వాత ఆదివారం బీఆర్‌ఎస్ నేతలు వెళ్లి గులాబీ కండువా వేశారు. ఈ సందర్భంగా బంగారయ్య మాట్లాడుతూ ఊరంతా ఏకమై తనను సర్పంచ్‌గా ఏకగ్రీవం చేశారని, తాను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని చెప్పారు.
టీడీపీ.. కాంగ్రెస్ అంటూ..
నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలం అప్పిరెడ్డిపల్లిలో సర్పంచ్‌గా టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు బుడ్డోళ్ల శ్రీనివాస్ భార్య మల్లీశ్వరి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. అక్కడ ఎనిమిది వార్డుల్లోనూ ఒక్కొక్కరే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవ పంచాయతీ లాంచనమే. ఎనిమిదో వార్డు సభ్యుడిగా నామినేషన్ వేసిన కాంగ్రెస్ మద్దతుదారు శ్రీనివాస్‌ను ఉప సర్పంచ్‌గా ఎన్నుకునేందుకు రంగం సిద్ధం చేశారు. పలు సామాజిక మాధ్యమాల్లో టీడీపీ.. కాంగ్రెస్, జై తెలుగుదేశం.. జై తెలంగాణ అంటూ పోస్టులు దర్శనమివ్వడం గమనార్హం.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తొలి విడత పంచాయతీ పోరులో నామినేషన్ల ఘట్టానికి తెరపడింది. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల పరిధిలో మొదటి దశలో 550 జీపీల సర్పంచ్‌లు, 4,840 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. నామినేషన్ల గడువు ముగిసే నాటికి 14 గ్రామాలు ఏకగ్రీవం దిశగా అడుగులు వేశాయి. ఆయా ప్రాంతాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు ఒక్కొక్కటి చొప్పునే నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో వాటిని ఏకగ్రీవ పంచాయతీలుగా ప్రకటించడం లాంచనమేనని తెలుస్తోంది. మరోవైపు పలు జీపీల్లోని అన్ని వార్డుల్లో ఒక్కొక్కరు చొప్పునే నామినేషన్లు వేయగా.. సర్పంచ్‌లుగా మాత్రం ఇద్దరు, ముగ్గురు పోటీపడుతున్నారు. వారు ఉపసంహరించుకునేలా పెద్దలు రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏకగ్రీవ పంచాయతీల సంఖ్య పెరగనున్నట్లు తెలుస్తోంది.
జోగుళాంబ గద్వాల
0
మహబూబ్‌నగర్
2 (అంచన్‌పల్లి, కాకర్‌జాల్)
ఇప్పటి వరకు
ఏకగ్రీవమైన జీపీలు
ఇవే..
నారాయణపేట
5 (అప్పాయపల్లి,
పెద్దతండా, పర్సాపూర్,
అప్పిరెడ్డిపల్లి,
దామలతండా)
వనపర్తి
2 (నాగుల
కుంటతండా,
లక్ష్మీదేవిపల్లి)
పలు జీపీల్లో వార్డుల్లోనేమో సింగిల్.. సర్పంచ్‌కు పోటాపోటీ
కొన్నిచోట్ల సీన్ రివర్స్.. ఆయా చోట్ల పెద్దల రాజీ యత్నాలు
ఉపసంహరణ నాటికి కొలిక్కి వచ్చే అవకాశం
ఆ జీపీలు ఏకగ్రీవమే..!
ఆ జీపీలు ఏకగ్రీవమే..!


