నేటినుంచి నూతన మద్యం పాలసీ | - | Sakshi
Sakshi News home page

నేటినుంచి నూతన మద్యం పాలసీ

Dec 1 2025 9:36 AM | Updated on Dec 1 2025 9:38 AM

ఉమ్మడి జిల్లాలో 227దుకాణాలు ప్రారంభానికి ముమ్మర ఏర్పాట్లు

గుడ్‌విల్‌ ఇచ్చి కొన్నింటిని

సొంతం చేసుకున్న వ్యాపారులు

మహబూబ్‌నగర్‌ క్రైం: ఉమ్మడి జిల్లాలో సోమవారం నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి రానుంది. మొత్తం 227 ఏ4 మద్యం దుకాణాలకు అక్టోబర్‌ 6 నుంచి 23 వరకు టెండర్లు నిర్వహించగా 5,536 దర ఖాస్తులు వచ్చాయి. దీంతో అక్టోబర్‌ 27న ఆయా జి ల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్లలో కలెక్టర్లు లక్కీడిప్‌ నిర్వహించి 227 మంది నూతన మద్యం లైసెన్స్‌దారుల ను ఎంపిక చేశారు. ఈ మేరకు కొత్తగా లైసెన్స్‌ దక్కించుకున్న వ్యాపారులు ఆయా ప్రాంతాల్లో దుకాణాలు ఏర్పాటు చేసుకునే పనుల్లో తలమునకలయ్యారు.

ఇటీవల మద్యం దుకాణాలు సొంతం చేసుకున్న లైసెన్స్‌దారులకు రూ.లక్షలు ముట్టజెప్పి దుకాణాలు సొంతం చేసుకున్నారు కొందరు సిండికేట్‌ వ్యాపారులు. కోయిలకొండ దుకాణానికి ఏకంగా ఏకంగా రూ.1.50 కోట్ల గుడ్‌విల్‌ ఆఫర్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. బాగా డిమాండ్‌ ఉన్న దుకాణాలకు అయితే రూ.లక్షల్లో గుడ్‌విల్‌తోపాటు వ్యాపారంలో వాటాలు ఇచ్చినట్లు సమాచారం. మొత్తంగా మద్యం దుకాణాల్లో మళ్లీ లిక్కర్‌ కింగ్‌లదే పైచేయిగా మారింది. లక్కీడ్రా తీసినా బినామీ పేర్లతో దుకాణాలు కై వసం చేసుకున్నారు. ఒక్కో దుకాణానికి తమ అనుచరులు, పనిచేసే వ్యక్తులతో టెండర్లు వేయించి దుకాణాలు దక్కేలా వేసిన ఎత్తుగడలు ఫలించాయి. మరికొన్ని చోట్ల ఇతరులకు దుకాణాలు వచ్చినా గుడ్‌విల్‌ ఇస్తామంటూ బేరసారాలు చేసి రూ.లక్షల్లో ముట్టజెప్పి దుకాణాలు కై వసం చేసుకున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో అక్టోబర్‌ 27న మద్యం దుకాణాలకు లక్కీడిప్‌ తీసిన నాటి నుంచి ప్రత్యేక పథకాలు, పావులు కదిపి లిక్కర్‌ కింగ్‌లు పైచేయి సాధించారు. మద్యం వ్యాపారంలో ఎంత ఆదాయం ఉంటే ఇంత పోటీ ఉంటుందనేది ఆసక్తి రేకెత్తిస్తోంది.

జిల్లా మొత్తం దరఖాస్తులు ఫీజు

దుకాణాలు (రూ.కోట్లలో..)

మహబూబ్‌నగర్‌ 54 1,634 49.02

నాగర్‌కర్నూల్‌ 67 1,518 45.54

నారాయణపేట 36 853 25.59

జోగుళాంబ గద్వాల 34 774 23.22

వనపర్తి 36 757 22.71

ఉమ్మడి జిల్లా పరిధిలో ఇలా..

వారిదే పైచేయి..

గణనీయంగా అమ్మకాలు

ప్రస్తుతం రెండేళ్లు ఉండే నూతన మద్యం వ్యాపారులకు స్థానిక పంచాయతీ ఎన్నికలతోపాటు రాబోయే పరిషత్‌, కార్పొరేషన్‌, మున్సిపాలిటీ ఎన్నికలు కలిసి రానున్నాయి. ఆయా ఎన్నికల్లో మద్యం అమ్మకాలు తారస్థాయిలో ఉంటాయి. ప్రధానంగా సర్పంచ్‌ ఎన్నికలకు బెల్ట్‌ దుకాణాలకు అధిక మోతాదులో లిక్కర్‌ సరఫరా కానుంది. దీంతో మండల కేంద్రాల్లో ఉన్న లిక్కర్‌ దుకాణాలతోపాటు పట్టణాల్లో సై తం గణనీయంగా అమ్మకాలు పెరగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement