ఆదిశిలా క్షేత్రంలో వైభవంగా ధ్వజారోహణం
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు ఆధ్వర్యంలో ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. వేదపండితులు రమేషాచారి, మధుసూదనాచారి, ప్రసన్నచారి, ధీరేంద్రదాసు, శశాంక్ ఆగమ పద్ధతిలో స్వామి వారికి పంచామృతాభిషేకం నిర్వహించి పూజలు చేశారు. బ్రహ్మోత్సవాల కంటే ముందు ధ్వజారోహణంతో దేవతామూర్తులను ఆహ్వానించి బ్రహ్మోత్సవాలు ఎలాంటి ఆటంకాలు కలగకుండా విజయవంతం కావాలని కోరినట్లు ఆలయ అఽర్చకులు తెలిపారు. అదే విధంగా సంతానం లేని మహిళలకు ధ్వజారోహణం రోజు అర్చకులు ప్రసాదాన్ని అందజేశారు. యేటా ధ్వజారోహణం రోజున వివిధ ప్రాంతాల నుంచి సంతానం కానీ మహిళలు ఆలయానికి పెద్దసంఖ్యలో చేరుకుని స్వామి వారి ప్రసాదం పొందడం భక్తుల నమ్మకం. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి, అరవిందరావు, చంద్రశేఖర్‌రావు, బాబురావు, మండల నాయకులు మధుసూదన్‌రెడ్డి, సీతారామిరెడ్డి, న రేందర్, వాల్మీకీ పూజారులు పాల్గొన్నారు.
ఆదిశిలా క్షేత్రంలో వైభవంగా ధ్వజారోహణం


