శత శాతమే లక్ష్యం..!
పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
● ఇంటింటికీ తిరిగి విద్యార్థులను బడికి పంపాలని అవగాహన
● వారంలో ఒక పాఠశాలను తనిఖీ చేయాలని కలెక్టర్ ఆదేశం
● జనవరిలోగా సిలబస్ పూర్తి చేసేలా ప్రణాళిక
● మెరుగైన ఫలితాలకు విద్యాశాఖ కసరత్తు
విభాగాల వారీగా విభజన
పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు అనుసరించాల్సిన పద్ధతులపై రెండు దశలుగా యాక్షన్ ప్లాన్ రూపొందించారు. సంక్రాంతి సెలవులకు ముందు మొదటి దశ ప్లాన్, సెలవుల తరువాత రెండో దశ ప్లాన్‌ను అమలు చేయాడానికి కసరత్తు చేశారు. ప్రతి రోజు స్లిప్ టెస్టు నిర్వహిస్తున్నారు. ఇందులో వచ్చే మార్కుల ఆధారంగా విద్యార్థులను ఏబీసీ విభాగాలుగా విభజించనున్నారు. సీ విభాగ విద్యార్థులు ఉత్తీర్ణులయ్యేలా.. వారు నైపుణ్యాలు పెంపొందించుకునేలా తర్పీదు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నారు.
గద్వాలటౌన్: పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈమేరకు వచ్చే జనవరిలోగా సిలబస్‌ను పూర్తి చేయాలని నిర్ణయించారు. నిర్దిష్ట గడువులోగా సిలబస్ పూర్తి చేస్తే విద్యార్థులను వార్షిక పరీక్షలకు సిద్ధం చేయొచ్చని విద్యాశాఖ భావిస్తుంది. ఆ దిశగా పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు జిల్లా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. గతంలో ఎదురైన అనుభవాలతో సరికొత్త ప్రణాళికతో ఉత్తమ ఫలితాలు సాధించగలమని ఉపాధ్యాయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థుల హాజరుపై దృష్టి
విద్యార్థుల హాజరుశాతం ఉత్తీర్ణతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బోధన సమయంలో విద్యార్థులు గైర్హాజర్ గురవుతున్నారు. గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మొదటి నుంచి బడికి రాని విద్యార్థులపై ఉపాధ్యాయులు దృష్టి సారించారు. విద్యార్థుల ఇంటికి వెళ్లి ఆరా తీయడంతో పాటు తల్లిదండ్రులకు బడికి పంపించాలని అవగాహన కల్పిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు విద్యార్థులను పంపిస్తున్నారనే విషయం గుర్తించి ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టికి తీసుకెళ్లి బడికి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. పాఠశాలకు క్రమం తప్పకుండా వచ్చేలా చేయడంలో దాదాపు అందరు ఉపాధ్యాయులు సఫలీకృతులవుతున్నారు.
పదో తరగతి విద్యార్థులు 5,594
త్వరలో ప్రత్యేక తరగతులు
ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆ దిశగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నాం. అన్ని పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించడానికి చర్యలు చేపట్టాం. గత ఏడాది మంచి ఫలితాలు సాధించాం. ప్రస్తుతం అంతకంటే మెరుగైన ఉత్తీర్ణత సాధించేలా చర్యలు చేపడుతాం. ఉత్తమ బోధన చేస్తు మెరుగైన ఫలితాలు వచ్చేలా కృషి చేస్తాం.
– విజయలక్ష్మి, డీఈఓ
కేజీబీవీలు
12
శత శాతమే లక్ష్యం..!


