దేశ సమగ్రతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి
గద్వాల క్రైం: దేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరు పని చేయాల్సిందిగా కలెక్టర్ సంతోష్ అన్నారు. గురువారం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. దేశంలో భిన్నమతాలు, జాతులు, వివిధ భాషాలు, సంస్కృతి, సంప్రాదాయాలు, ఆచార వ్యవహారాలను ప్రతి ఒక్కరు గౌరవిస్తూ ఐక్యమత్యంగా జీవిస్తున్నామన్నారు. భారత యూనియన్‌లో కలిసేందుకు సర్దార్ వల్లభాయి పటేల్ కృషి చేశారన్నారు. అనంతరం ఎమ్యెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మనిషి జీవితంలో ఎదగాలంటే ధృఢ సంకల్పాన్ని అలవర్చుకోవాలన్నారు. సమగ్రత దిశగా ముందుకు వెళ్దామన్నారు. అనంతరం రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా పోలీసు కార్యాలయం నుంచి పట్టణ పుర వీధులలో పోలీసు సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు ర్యాలీ నిర్వహించారు. అదనపు కలెక్టర్ లక్ష్మీనారయణ, ఏఎస్పీ శంకర్, డీఎస్పీ మొగిలయ్య, సీఐ, ఎస్‌ఐలు తదితరులు ఉన్నారు. ఇదిలాఉండగా, ఎస్పీ కార్యాలయంలో వ్యాసరచన, ఫొటోగ్రఫీ తదితర విభాగాల్లో విజేతలుగా నిలిచిన వారికి ఎస్పీ శ్రీనివాసరావు బహుమతులు అందజేశారు.


