
కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా
మల్దకల్: మండలంలోని ఉలిగేపల్లి గ్రామంలో సోమవారం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సెంట్రల్ మానిటరింగ్ టీం సభ్యులు బాలమురళి, రాధిక పరిశీలించారు. ఈసందర్భంగా వారు గ్రామంలో కేంద్ర నిధులతో చేపట్టిన మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలతో పాటు ఉపాధిహామీ పనులను పరిశీలించారు. గ్రామ పంచాయతీలకు వచ్చే నిధుల వినియోగంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఉపాధి హామీ పనులు చేసిన ప్రదేశాలు, కూలీలకు అందిన బిల్లులు, పనుల రికార్డులను పరిశీలించారు. కూలీలందరికి జాబ్‌కార్డులు అందించి వారికి ఉపాధి పనులు కల్పించాలని సూచించారు. కేంద్ర నిధులను వినియోగించుకొని గ్రామాలను అభివృద్ధి పరుచుకోవాలన్నారు. అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం వద్ద మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఏపీడీ శ్రీనివాసులు, ఎంపీడీఓ ఆంజనేయరెడ్డి, ఎంపీఓ రాజశేఖర్, పీఆర్‌ఏఈ బషీర్, ఎంపీఓ సుజాత, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
గుడ్డెందొడ్డి రిజర్వాయర్ నుంచి నీటి విడుదల
ధరూరు: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగమైన గుడ్డెందొడ్డి రిజర్వాయర్ నుంచి ఎడమ కాల్వకు సాగు నీటిని విడుదల చేశారు. సోమవారం ఉప్పేరు, మాల్‌దొడ్డి, ఖమ్మంపాడు, గుడ్డెందొడ్డి గ్రామాలకు చెందిన రైతుల సమక్షంలో పీజేపీ జీఈలు వెంకట్ నవీన్, సుమంత్ రెగ్యూలటరీ వద్ద నీటిని విడుదల చేశారు. అంతకు మందు గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖరీఫ్ పంట సాగుకు అవసరమయ్యే సాగు నీటిని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సాగు నీటిని వృథా చేసుకోకుండా చూడాలని రైతులను కోరారు. ఈ సారి వర్షాలు సమృద్దిగా కురిశాయని, రైతులకు మందుస్తుగానే పంటలకు సాగు నీరందించడం జరుగుతుందని, ప్రభుత్వం రైతుల పక్షాన ఉందని, రైతు కుటుబాలు సుభిక్షంగా ఉండాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో రైతులు రంగారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రాములు, అంజి సాగర్, గోవిందు తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా