విజేతలెవరో?

- - Sakshi

నేడే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు..

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌ / సాక్షి, నాగర్‌కర్నూల్‌: అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నియోజకవర్గాల కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభంకానుంది. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఇప్పటికే అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్‌ అధికారులు కౌంటింగ్‌ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. నియోజకవర్గానికి 14 టేబుళ్ల చొప్పున కౌంటింగ్‌ చేపట్టనుండగా, ఒక్కో నియోజకవర్గానికి 19 నుంచి 21 వరకు రౌండ్లలో లెక్కింపు ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

నరాలు తెగే ఉత్కంఠ.. విజేతలెవరో, పరాజితులెవరో తేలే సందర్భం. తమ నుదిటి రాత ఎలా ఉండబోతోందంటూ బరిలో నిలిచిన నేతల్లో ఉద్విగ్నత... కూడికలు, తీసివేతల లెక్కలతో పార్టీలు, అభ్యర్థులు ఎడతెరగని కుస్తీ.. ఓటరు దేవుడు వెల్లడించే తీర్పు కోసం ఎదురుచూపులు.. గెలుపోటములు, ఓట్లు, సీట్ల లెక్కలతో సంబంధం లేకుండా అధికారయంత్రాంగం ఓట్ల లెక్కింపు ఏర్పాట్లలో బిజీ...ఇది ఆదివారం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో నెలకొన్న పరిస్థితి.

జడ్జిమెంట్‌ డే

ముందుగాపోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు..

ఆదివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఆయా జిల్లాకేంద్రాల్లోనే జిల్లాల పరిధిలోని నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కౌంటింగ్‌ ప్రక్రియలో ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా రెండు టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సర్వీస్‌ ఓటర్ల లెక్కింపు చేపడతారు. నియోజకవర్గాల వారీగా ఇప్పటికే అందిన ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్‌మిటెడ్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ సిస్టమ్‌ (ఈటీపీబీఎస్‌) సర్వీస్‌ ఓటర్ల ఓట్లను లెక్కించనున్నారు. అనంతరం సుమారు 8.30 గంటల నుంచి ఈవీఎంల ద్వారా ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.

ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు

ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్‌ ప్రారంభం

ప్రజా తీర్పుపై సర్వత్రా

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు

గెలుపుపై ఎవరికి వారే ధీమా

ఉత్కంఠ

Read latest Jogulamba News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top